end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంTSRTCలో కారుణ్య నియామకాలు !
- Advertisment -

TSRTCలో కారుణ్య నియామకాలు !

- Advertisment -
- Advertisment -
  • 8 ఏళ్ల తర్వాత పాలకవర్గ సమావేశం
  • 300 అంశాలపై చర్చ
  • ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి సజ్జనార్‌

తెలంగాణ ఆర్టీసీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. దాదాపు 300 అంశాలపైన విస్తృత చర్చ జరిగింది. ఆర్టీసీ ఎండి సజ్జనార్‌, సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీఆఎస్‌ఆర్టీసీలో త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడుతామని వెల్లడించారు. ఆర్టీసీ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మీకులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పిస్తామని నిర్ణయించారు. దీంతో సుమారు 1200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. దాదాపు 8 సంవత్సరాల తర్వాత పాలకవర్గ సమావేశం జరగడం విశేషం.

డీజీల్‌ సెస్‌, పెట్రోల్‌ సెస్ విషయంలో ప్రజలు అర్థం చేసుకొని పెరిగిన టికెట్‌ ధరలను ఆహ్వానించారని, ఎలాంటి వ్యతిరేకత రాకపోవడం చాలా సంతోషకరమని ఎండి సజ్జనార్‌ తెలిపారు. సంస్థను నష్టాలబారి నుండి కాపాడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏసీ, నాన్‌ ఏసీ, స్లీపర్‌ కోచ్‌ బస్‌ సర్వీసులను దూర ప్రాంతాలకు నడపాలని తీర్మానించారు. అలాగే వాణిజ్య భవనాల ద్వారా కూడా ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకున్నట్లు ఛైర్మన్‌ బాజిరెడ్డి తెలిపారు.

డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడం వల్ల ఆర్టీసికి తీవ్ర నష్టం వచ్చిందని ఎండి సజ్జనార్‌ తెలిపారు. దీంతో ఎలక్ర్టిక్‌ బస్‌ సర్వీసులపై దృష్టి పెట్టామని, దశల వారీగా జిల్లాలలో కూడా ఎలక్ర్టిక్‌ బస్‌లు నడిపిస్తామని ఆయన వివరించారు. అంతేగాకుండా 1,060 కొత్త బస్సులను కూడా కొనుగోలు చేసేందుకు టెండర్లు వేసామని చెప్పారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాడానికి ఆయన కృషి చేయన్నుట్లు పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -