end

విషమించిన అస్సాం మాజీ సీఎం ఆరోగ్యం

గువాహటి : అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తరుణ్‌ గొగోయ్‌ ఆరోగ్యం మరింత విషమించింది. కరోనాను నుంచి కోలుకున్న ఆయన.. తదనంతరం పలు ఆరోగ్య సమస్యలతో గువాహటి మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో ఈనెల 2 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. వెంటిలేటర్‌పై తరుణ్‌ గొగోయ్‌కి చికిత్స అందిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిస్వ శర్మ శనివారం వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, కీలక అవయవ వ్యవస్థలు వైఫల్యం చెందాయని డాక్టర్లు తెలిపారన్నారు. కాగా, ఆగస్ట్‌ 25న గొగోయ్‌కి కోవిడ్‌గా నిర్ధారణ అయింది. కోవిడ్‌ నుంచి కోలుకున్నా.. ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు.. శ్వాస ఆడకపోవడం, ఊపిరితిత్తుల సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నట్లు సమాచారం.

Exit mobile version