end

కొత్త ఏడాదిలో పాదయాత్ర చేపట్టనున్న కాంగ్రెస్‌..!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టనుంది. కొత్త సంవత్సరంలో మహా పాదయాత్ర చేపట్టే దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి పార్టీ నేతలు పాదయాత్రనే సెంటిమెంటుగా భావిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా అధిష్ఠానం ఎవరిని నియమించినా.. రానున్న మూడేళ్లూ రాష్ట్రాన్ని చుట్టి రానున్నట్లు చెబుతున్నాయి.

పెద్ద మనసు చాటుకున్న మంత్రి హరీష్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీన పడడానికి వరుస ఎన్నికల్లో ఓటమితో పాటు నేతలు ప్రజలతో మమేకం కాకపోవడమూ కారణమని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పార్టీ నేతలు పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని, వారికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం స్పష్టం చేసింది. దీంతో ప్రజల్లో అలాంటి నమ్మకాన్ని కలిగించడానికి, అధికారం వైపునకు అడుగులు వేయడానికి విస్తృతంగా పాదయాత్రలు చేపట్టాలన్న అభిప్రాయాలు పార్టీలో బలపడ్డాయి.

రైతుబంధు రావట్లేదా..?

ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండి.. 2004లో తిరిగి అధికారంలోకి రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ పాదయాత్రనే కారణమని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అలాగే 2014 నుంచీ అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకూ పాదయాత్రను సెంటిమెంటుగా చూస్తున్నారు.రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ దూసుకువస్తున్న నేపథ్యంలో 2023 ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి చావో.. రేవో అన్నట్లుగా మారాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం నుంచి కాంగ్రెస్‌ పాదయాత్ర సీజన్‌ మొదలు కానుందని చెబుతున్నారు.

పెళ్లిపై సింగర్ సునీత రియాక్షన్‌

Exit mobile version