end

ఆత్మహత్యా? లేదా మిస్‌ఫైరా?

  • హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌ మృతి

హైదరాబాదులో పోలీస్‌ కానిస్టేబుల్‌ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మహంకాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది. రాణిగంజ్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ మధు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ర్ట కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ గన్‌తో కాల్చుకొని అకస్మాత్తుగా కూలిపోయాడు. ఇతను నల్లగొండ జిల్లా వాసిగా పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం ఆత్మహత్యగా దృవీకరించడం లేదు. బ్యాంకు మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు గన్‌ మిస్‌ఫైర్‌ అయిందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Also Read below…

Exit mobile version