end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంనిరుపేద అమ్మాయికి పెళ్లి చేసిన కానిస్టేబుల్‌
- Advertisment -

నిరుపేద అమ్మాయికి పెళ్లి చేసిన కానిస్టేబుల్‌

- Advertisment -
- Advertisment -

మెదక్ జిల్లా రేగోడు గ్రామానికి చెందిన ఇరుగదిండ్ల కూతురు మమత వివాహాన్ని దగ్గరుండి జరిపించాడు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ వీరేశం. ఆయన తన సొంత డబ్బులతో అమ్మాయి వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. అమ్మాయి కుటుంబానికి చెందిన సభ్యులు.. వీరేశం, అతనికి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంలో కానిస్టేబుల్ వీరేశం మాట్లాడుతూ.. పేద కుటుంబానికి చెందిన అమ్మాయి వివాహం చేయడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. పేదలకు నిస్వార్థంగా సాయం చేస్తే అందులో ఉండే అనుభూతే వేరని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అమ్మాయి తల్లి మరణించడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండడంతో తన వంతు సాయం అందించాలనే ఆలోచనతో పెళ్లి చేయడానికి సహకరించానని అన్నారు. ఎంతైనా కానిస్టేబుల్‌ వీరేశం ధాతృత్వాన్ని ప్రశంసించాల్సిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -