73వ భారత రాజ్యాంగ దినోత్సవం(Indian Constitution Day) పురస్కరించుకొని దిశా సేవా సంస్థ, బహుజన గలం ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలకు, సమాజంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సమాజ సేవకులకు డా. బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారాలు-2022 రవీంద్ర భారతి హైదరాబాదు(Hyderabad)లో రాష్ట్రస్థాయి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ గంట చక్రపాణి, తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చేతుల మీదుగా సన్మానాలు(Honors) చేసి పురస్కారం అందజేశారు. దానిలో భాగంగానే సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, నవ తెలంగాణ రిపోర్టర్ పుట్టరాజు గారికి రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం-2022 అందజేసి, ఘన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా పుట్ట రాజు(Putta Raju) మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తి అంటే ఉద్యోగం కాదని అది ఒక సామాజిక బాధ్యతతో సమాజంలో జరిగే అన్యాయాలు, దోపిడీ, అక్రమాణాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలను వెలికి తీయడమే కాకుండా వాటికి పరిష్కార మార్గాలు చూపించడమే జర్నలిజం అంటారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తూ ప్రభుత్వం అందించే పథకాలు అభివృద్ధి(Development) ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేది జర్నలిస్టులు, మీడియా అన్నారు. సమాజ మార్పు కోసం పని చేయడం జర్నలిజమని అలాంటి ఉత్తమ జర్నలిస్టుల(Journalist)ను గుర్తించి ఈ సత్కారం, పురస్కారం అందజేసిన దిశ సేవా సంస్థ, బహుజన గళం నిర్వహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సత్కారం మరింత బాధ్యత పెంపొందించిందని ఇదే ప్రోత్సాహంతో మరింత బాధ్యతయుతంగా వార్తా కథనాలు రాస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు, దిశా సేవా సంస్థ అధ్యక్షులు గొల్లబోయిన అంబేడ్కర్, సీనియర్ జర్నలిస్టు బండారు రాజు, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ అనురాధ, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త మారోజు దిశ, న్యాయవాది సౌడ నవీన్, కవి రచయిత రఘు పతిరావు, కళాకారులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
(Telangana:కంటి వెలుగు కోసం రూ. 200 కోట్లు)