- రెండేళ్ల ఒప్పంద ప్రతిపాదికన పలు ఉద్యోగాలు
భారతప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో కాంట్రాక్టు ప్రాతిపదికన బ్యాంకు సహాయక సిబ్బందిని భర్తీ నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే అభ్యర్థులు ఆఫ్‌లైన్ దరఖాస్తులను మార్చి 22లోగా సంస్థ కేంద్రమైన కోల్‌కతాకు పోస్టల్ ద్వారా ఈ కింద పేర్కొన్న చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
సంస్థ చిరునామా
అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్ డిపార్ట్‌మెంట్, ఆరో అంతస్తు, 5, బీటీఎం సరాని, కొలకత్తా–700001.
పోస్టులు – ఖాళీలు
ఫ్యాకల్టీ-01
ఆఫీస్ అసిస్టెంట్–02
అటెండెంట్–01
వాచ్‌మెన్ –01
మొత్తం పోస్టుల సంఖ్య – 05
ఒప్పందంః రెండు సంవత్సరాలు
వేతనంః పోస్టుల ప్రకారం సంస్థ రూల్స్ అనుసరించి రూ.5,000 నుండి రూ.20,000 వరకు ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదిః మార్చి 22, 2021
మరిన్ని పూర్తి వివరాల కోసం బ్యాంకు వెబ్‌సైట్ https://www.bankofindia.co.in ను సంప్రదించండి.