end
=
Monday, January 20, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంCardamom:యాల‌కుల‌తో శృంగార స‌మ‌స్య‌ల‌కు చెక్‌
- Advertisment -

Cardamom:యాల‌కుల‌తో శృంగార స‌మ‌స్య‌ల‌కు చెక్‌

- Advertisment -
- Advertisment -

Cardamom:యాల‌కులు కేవ‌లం సువాస‌న(fragrance) కోసం మాత్ర‌మే కాదు.. మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్యల నుంచి మ‌న‌ల్ని బ‌య‌ట ప‌డేయ‌డానికి కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వాటిని చాలా మంది వంట‌లు, టీలో వేసుకుని తీసుకుంటుంటారు. అయితే యాల‌కులు శృంగార ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌(Romantic Problems)కు కూడా అమోఘంగా ప‌నిచేస్తాయ‌ని.. సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తేలింది. మ‌రి యాల‌కుల‌తో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!

  • యాల‌కులు ఆందోళ‌న నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. ఒత్తిడి(Stress), మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను దూరం చేసి మూడ్ ను మారుస్తాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను క‌లిగిస్తాయి. శృంగారంలో స‌రిగ్గా పాల్గొన‌లేక‌పోతున్నామ‌ని భావించే వారు నిత్యం ఏదో ఒక రూపంలో యాల‌కుల‌ను తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది.
  • నిత్యం 1 లేదా 2 టీస్పూన్ల యాల‌కులను తీసుకుంటే వీర్య వృద్ధి(Sperm Growth) చెందుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే న‌పుంస‌క‌త్వం(Impotence) స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
  • శృంగారంలో చాలా మందికి శీఘ్ర స్ఖ‌ల‌న(Premature ejaculation) స‌మ‌స్య ఉంటుంది. అయితే దానికి యాల‌కుల‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు. యాల‌కుల‌ను తీసుకుంటే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొన‌వ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది.

చ‌ర్మంపై ఏర్ప‌డే న‌ల్ల‌మ‌చ్చ‌ల‌ను యాల‌కులు పోగొడ‌తాయి. జుట్టు ఊడిపోవ‌డం, వెంట్రుక‌లు చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.

5 యాల‌కుల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల అజీర్తి త‌గ్గుతుంది. గ్యాస్ పోతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -