భారత్‌లో కరోనా కేసులు 90 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 45,882 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 90, 04,366కు చేరుకుంది. అందులో 4,43,794 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 84,28,409 మంది రికవరీ అయ్యారు. కొత్తగా కరోనా కారణంగా 584 మరణాలు సంభవించగా.. ఆ సంఖ్య 1,32,162కు చేరుకుంది. దేశంలో 50వేల కంటే తక్కువ కేసులు నమోదు కావడం ఇది కంటిన్యూయస్‌గా 13వ రోజు. నవంబర్ 7కు ముందు దేశంలో కచ్చితంగా 50వేలకు పైగా కేసులు నమోదయ్యేవి.
రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్రలో అత్యధికంగా 80,728 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా, కేరళలో 68,352, ఢిల్లీలో 43,221 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఐసీఎమ్‌ఆర్ ప్రకారం మొత్తం దేశవ్యాప్తంగా 12,95,91,786 టెస్టులు చేయగా, నిన్న ఒక్కరోజే 10,83,397 కరోనా టెస్టులు చేశారు.