భారత్‌లో కరోనా వైరస్ కేసుల పెరుగుదల చూస్తుంటే ఫోర్త్‌వేవ్ మొదలైందా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా అధికమవుతున్నాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు మళ్లీ 19 వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 18,930 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,66,739కు పెరిగింది. ఈ మేరకు కేంద్రవైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 35 మంది మరణించారు. ఇప్పటి వరకు 5,24,305 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 14,650 మంది కోలుకోగా మొత్తం మహమ్మారి నుంచి 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 1,19,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.52శాతంగా ఉంది. ఇక ఇప్పటి వరకు 198 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
- Advertisment -
మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -