end
=
Sunday, January 19, 2025
వార్తలుమెగా హీరోలకు కరోనా
- Advertisment -

మెగా హీరోలకు కరోనా

- Advertisment -
- Advertisment -

మెగా ఫ్యామిలీ యంగ్‌ హీరోస్‌ రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌లకు కరోనా సోకింది. ఈ రోజు ఉదయమే తాను కరోనా బారినపడినట్లు రామ్‌చరణ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ టెస్ట్‌ చేసుకోవాలని కోరారు. అయితే చరణ్‌ అనంతరం ప్రస్తుతం మరో మెగా హీరోకు కరోనా బారిన పడ్డారు. నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌కు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.

ఈ రోజు ఉదయం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొద్దిగా లక్షణాలు ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే తిరిగి వస్తాను. మీ అందరి ప్రేమకు కృతజ్ఞుడిని’. అని ప్రకటన విడుదల చేశారు. మెగా హీరోలిద్దరూ కరోనా సోకడంతో అభిమానులు #Get Well Soon అనే హ్యష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు.‌ కాగా నాలుగు రోజుల క్రితమే వరుణ్‌తేజ్‌ తమ‌ కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్టమస్‌ జరుపుకున్నారు. ఇప్పుడు వీరంతా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చరణ్‌, వరుణ్‌కు పాజిటివ్‌గా తేలడంతో మెగా కుటుంబంలో టెన్షన్‌ మొదలైంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -