end
=
Thursday, November 21, 2024
వార్తలుజాతీయంCovid:మళ్లీ విజృంభిస్తున్న కరోనా
- Advertisment -

Covid:మళ్లీ విజృంభిస్తున్న కరోనా

- Advertisment -
- Advertisment -

  • చైనాలో ఒక్కరోజులోనే 30 వేలు ధాటిన బాధితులు
  • భారత్‌లో గత 24గంటల్లో 408 పాజిటీవ్ కేసులు


కరోనా (Covid) మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత రెండేళ్ల (2 Years) కిందట ప్రపంచాన్ని అలలాకుతలం చేసిన వైరస్ (Virus) మళ్లీ పురుడు పోసుకుంటోంది. తాజాగా వైరస్ పుట్టినిల్లు చైనాలో (China) మరోసారి కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ కొత్త కేసులు దేశంలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. చైనాలో ఒక్కరోజులోనే 30 వేలకు(30 thousand) పైగా కేసులు (Case) నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో అనేక ఆంక్షలు విధించారు. కరోనా మహమ్మారి మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. అత్యధిక కేసులు నమోదవడం ఈ నవంబర్‌, డిసెంబర్‌ (November- December)నెలల్లోనే కరోనా కేసులు పెరిగాయి. వైరస్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతీసారి ఈ నెలల్లోనే వ్యాప్తి కనిపిస్తోంది. గతేడాది వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్‌ వేరియంట్ (Omicron variant) కూడా ఈ సమయంలోనే భారత్‌లో కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చైనాలో పెరుగుతోన్న కేసులు భారతదేశానికి కూడా కొత్త ముప్పుగా మారతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.

భారత్‌లో (India) కరోనా లెక్కలను పరిశీలిస్తే, గత 24 గంటల్లో 408 కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా దేశంలో కోవిడ్ కేసులు అత్యల్ప స్థాయిలో ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అదుపులో ఉన్నాయి. ఈ వైరస్ కారణంగా మరణాలు లేవు (No deaths) ఆసుపత్రిలో చేరే వారు కూడా భారీగా తగ్గారు. యాక్టివ్ కేసులు (Active case)కూడా 6 వేల లోపే తగ్గాయి. పాజిటివిటీ రేటు (positivity rate) తగ్గుతోంది, రికవరీ రేటు (Recovery rate)కూడా పెరుగుతోంది. ఒమిక్రాన్‌ కొత్త రూపంతరాల ఉనికి పెద్దగా కనిపించడంలేదు. ఒమిక్రాన్‌కు చెందిన X-BB లేదా bf.7z వేరియంట్‌లతో ఏ రాష్ట్రంలోనూ కేసులు పెరగలేదు. దేశంలో కోవిడ్ అంటువ్యాధి దశలో ఉందని ఈ గణాంకాలు (Statistics) తెలియజేస్తున్నాయి.

ఇప్పుడు చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం త్వరలో భారతదేశంలో కనిపిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జుగల్ కిషోర్ (Epidemiologist Dr. Jugal Kishore) మాట్లాడుతూ.. ‘చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులకు కారణం స్పష్టంగా లేదు. అయితే అక్కడ ఇంకా కొత్త వేరియంట్ గుర్తించలేదు. అటువంటి పరిస్థితిలో అక్కడ పెరుగుతున్న కేసులు భారతదేశాన్ని ప్రభావితం చేయవు. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో Omicron అనేక రకాలు ఉన్నాయి అయితే దీని వ్యాప్తి పెద్దగా లేదు’ అని స్పష్టం చేశాడు.

(Cricket:రేపే తొలి వన్డే)

చైనాలో పెరుగుతున్న కేసుల కారణంగా భారతదేశంలో కోవిడ్ నమూనా (The covid pattern)లో గణనీయమైన మార్పు ఉండదని భావిస్తున్నారు. చైనాలో కొత్త వేరియంట్ రిపోర్ట్ (Variant report) వచ్చి ఉంటే దాని వల్ల కేసులు పెరిగేవి. ఇతర దేశాలలో కూడా ప్రమాదం ఉండవచ్చు. కానీ ప్రస్తుతానికి అలాంటి అవకాశం లేదు. అందుకే చైనాలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా భయపడాల్సిన అవసరం లేదు. కానీ రానున్న కొద్ది రోజుల్లో కరోనా నిబంధనలు పాటించాలి. లేకపోతే కేసులు పెరిగే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు. పెళ్లిళ్ల సీజన్‌ (Wedding season)లో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ చెబుతున్నారు. రానున్న రోజుల్లో దేశంలో భారీగా పెళ్లిళ్లు జరగనున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో (Elderly, with chronic diseases) బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అయితే డాక్టర్లు ప్రభావం లేదని చెప్పినా జనాల్లో మళ్లీ ఈ వార్త భయాందోళనకు గురిచేస్తుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -