end
=
Saturday, January 18, 2025
వార్తలుఅంతర్జాతీయంCorona:మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా
- Advertisment -

Corona:మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా

- Advertisment -
- Advertisment -

  • రాబోయే 3 నెలల్లో 60 శాతం మందికి కోవిడ్
  • ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫిగల్ డింగ్ ట్వీట్


గత రెండేళ్లపాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోన (Covid)మహమ్మారి మళ్లీ విజృభిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను బలితీసుకున్న కోవిడ్ ఎన్నో కుటుంబాలను రొడ్డున పడేసింది. ఊహించని రితీలో మనిషికి ఊపిరాడకుండా చేసి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేటట్లు చేసింది. అయితే గత ఆరు నెలలుగా పూర్తిగా అంతరించిపోయిందనే ధీమాతో మళ్లీ సాధారణ జీవితానికి అలవాడు పడ్డ ప్రజలకు పిడుగులాంటి వార్త వినిపించింది. కరోనా పుట్టిల్లు చైనా (China)లో తాజాగా కేసులా సంఖ్య భారిగా పెరుగుతున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు (International media organizations)తెలిపాయి. అంతేకాదు రానున్న రెండు మూడు నెలల్లో చైనా వ్యాప్తంగా 60 శాతానికి పెరిగే అవకాశం ఉందంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించాయి.

చైనాలో కరోనా కేసులు తీవ్రరూపం దాల్చింది. కేసుల సంఖ్య తీవ్రంగా పెరగడంతో ఆసుపత్రులు నిండిపోయానని నివేదికలు పేర్కొన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే 3 నెలల్లో చైనాలో 60 శాతం వైరస్ VIRUS బారిన పడే అవకాశం ఉందని ఎపిడెమియాలజిస్ట్, ఆరోగ్య ఆర్థికవేత్త ఎరిక్ ఫీగల్-డింగ్ (Epidemiologist and health economist Eric Feagle-Ding) తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘పరిస్థితి అదుపుతప్పేలా ఉంది. చైనాలో ఆంక్షల ఎత్తివేత తర్వాత ఆసుపత్రులు చాలా నిండిపోయాయి. రాబోయే 90 రోజుల్లో చైనా జనాభాలో 60 శాతం మంది ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మరణాలు కూడా లక్షల్లో ఉండొచ్చు’ అని ట్వీట్ చేశారు. వృద్ధుల టీకా రేటు (Vaccination rate), ఆసుపత్రులలో పెరుగుదల, ఇంటెన్సివ్ కేర్ (Intensive care)సామర్థ్యాన్ని పెంచడంలో చైనా అధికారులు విఫలమయ్యారని నిపుణులు పేర్కొన్నారు. దేశంలోని 140 కోట్ల పౌరులకు వైరస్‌ (A virus for citizens)ను ఎదుర్కొనే యాంటీ వైరల్ (Anti viral)మందులను నిల్వ చేయడంలో విఫలమయ్యారని నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే ఆసుపత్రులు నిండిపోయాయని ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని పలు నివేదికలు తెలిపాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే శ్మశాన వాటికలు 24 గంటల్లో పనిచేస్తున్నాయని పేర్కొన్నాయి. అంతేకాకుండా కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న మృతదేహాలు వచ్చి చేరుతున్నాయని వెల్లడించాయి.

మరణాల సంఖ్య తక్కువే:


మరోవైపు ఆంక్షల ఎత్తివేత తర్వాత ఆదివారం(sunday) రెండు మరణాలు (Deaths), సోమవారం (monday) ఐదు మరణాలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. అయితే ఫిగల్ డింగ్ (Figal ding)మాత్రం అనేక మరణాలను చైనా దాస్తుందని ఆరోపించారు. ఓ ఆసుపత్రిలోని ఐసీయూ (ICU)లో పదుల సంఖ్యలో పేషంట్లు ఉన్న ఫోటోను ఆయన షేర్ చేశారు. 2020 ప్రారంభంలో కరోనా మహమ్మారి బయట పడ్డాక చైనా ప్రభుత్వం (GOVT) కఠిన ఆంక్షలు అమలు చేస్తూ వచ్చింది. అయితే ఈ నెల ప్రారంభంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ఆంక్షలను ఎత్తివేసింది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి పెరగడం, ప్రభుత్వం పేషంట్లకు తగిన సదుపాయాల కల్పనలో విఫలమైనట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఫార్మాసీల్లో మెడిసిన్ (Medicine in pharmacies) కొరత ఏర్పడింది. బీజింగ్ ప్రధాన ప్రభావిత నగరాల్లో ఉండగా, షాంఘైతో పాటు మెట్రో, గ్రామీణ ప్రాంతాలకు (In addition to Shanghai, metro and rural areas) మహమ్మారి విస్తరించే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

(KCR Nutrition Kits:రేపటి నుంచే కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్లు!)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -