end

దేశంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం !

  • తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు
  • శుభపరిణామంటున్న వైద్య నిపుణులు
  • ఎమరపాటుగా ఉంటే మాత్రం మళ్లీ విజృంభించే అవకాశాలు

వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి భారీ చోరి

కరోనా వైరస్‌ … ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఓ మహమ్మారి. ఎందరో జీవితాలను చిన్నాభిన్నం చేసిన రక్కసి. ఇప్పుడిప్పుడే భారతదేశంలో అదుపులోకి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, ఇది చాలా సంతోషకరవిషయమని చెప్పుకోవచ్చు. అలాగనీ ప్రజలు ఎమరపాటుగా ఉంటే మాత్రం మళ్లీ విజృంభించే అవకాశాలు లేకపోలేదు.

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు

గడిచిన 24 గంటల్లో 46,791 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 75,97,064కు పెరిగింది. అయితే వైరస్‌ వల్ల 587 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 1,15,197కు చేరింది. దేశ వ్యాప్తంగా నిన్నటి రోజున 69,721 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 67,33,329గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 7,48,538 గా ఉంది. దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా ప్రజల సంచారం ఎక్కువైంది. కునక ప్రజలు ఇంకా పక్కాగా కోవిడ్‌ నిబంధనలు పాటించాల్సి ఉంది.

దసరా పండుగకు TSRTC ప్రత్యేక బస్సులు

Exit mobile version