end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయం3 వేల కరోనా పాజిటివ్‌ కేసులు
- Advertisment -

3 వేల కరోనా పాజిటివ్‌ కేసులు

- Advertisment -
- Advertisment -
  • 190 కోట్ల వ్యాక్సినేషన్‌ డోసుల పంపిణీ

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు రోజుకు 3 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 20 వేలకు పైగానే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 3,60,615 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 3,455 పాజిటివ్‌ కేసులు గుర్తించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో 1407, మహారాష్ర్టలో 253 కొత్తగా కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా వల్ల దేశవ్యాప్తంగా 40 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 5,24,064కు చేరుకుంది. 3079 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్‌ కేసులు 20,0635గా ఉన్నాయి. అయితే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 190.20 కోట్ల డోసులు కేంద్రం పంపిణీ చేసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -