end
=
Sunday, February 23, 2025
వార్తలురాష్ట్రీయంతెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
- Advertisment -

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

- Advertisment -
- Advertisment -
  • 24 గంటల్లో 394 పాజిటివ్‌ కేసుల నమోదు
  • ముగ్గురు మృతి

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వైరస్‌ ఇప్పట్లో తగ్గేలా కనబడడం లేదు. తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 394 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ వ్యాప్తి మళ్లీ పెరుగుతుండడం ప్రజలల్లో ఆందోళన కలిగిస్తుంది. కాగా 574 మంది కరోనా వైరస్‌ నుండి కోలుకొని ఇంటికి వెళ్లారు. అయితే దురదృష్టావశాత్తు ముగ్గురు మృతి చెందారు.

అయితే తెలంగాణలో మొత్తం ఇప్పటి వరకు 2,87,502 కరోనా కేసులు నమోదవగా 2,80,565 మంది వైరస్‌ బారి నుండి కోలుకున్నారు. 5,388 మంది ఇంకా యాక్టివ్‌ కేసులుగా ఉన్నారు. ఇప్పటి వరకు 1549 మంది కరోనా వైరస్‌ వల్ల మృత్యువాతపడ్డారు. ఏదేమైనా వైరస్‌ వ్యాప్తి కట్టడి అందరిపైనా ఉంది. ముఖ్యంగా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ సంక్షోభం నుండి బయటపడగలం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -