end
=
Friday, September 20, 2024
సినీమాసల్మాన్‌ డ్రైవర్‌కు కరోనా..
- Advertisment -

సల్మాన్‌ డ్రైవర్‌కు కరోనా..

- Advertisment -
- Advertisment -
  • హోం క్వారంటైన్‌లో సల్లూ భాయ్‌

ముంబై : తన వ్యక్తిగత డ్రైవరుతో పాటు తన దగ్గర పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు కరోనా వ్యాధి సోకడంతో ప్రముఖ బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. సల్మాన్ ఖాన్ వ్యక్తిగత డ్రైవర్, ఇద్దరు సిబ్బందికి కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో సల్మాన్ ఖాన్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. కరోనా గొలుసును విచ్ఛిన్నం చేసేందుకు 14 రోజుల పాటు తాను కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండాలని సల్మాన్‌ నిర్ణయించుకున్నారు. కరోనా బారిన పడిన తన సిబ్బందిని సల్లూ.. ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు.

కాగా, సల్మాన్ తల్లిదండ్రులు సలీంఖాన్, సల్మాఖాన్ ల వివాహ వార్షికోత్సవ వేడుకను కరోనా వల్ల రద్దు చేశారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలని సల్మాన్‌ ఆయన కుటుంబ సభ్యులు భావించారు. కానీ, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వేడుకలు చేయడం సరైన నిర్ణయం కాదని సల్మాన్‌ అండ్‌ ఫ్యామిలీ నిర్ణయించుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -