టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా మహమ్మారి సోకింది. ఇటీవల ఆమె చేయించుకున్న కోవిడ్ టెస్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా రకుల్ ఇన్‌స్టాలో పేర్కొంటూ.. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నానంది. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా. ఈ మధ్య నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండని రకుల్ విజ్ఞప్తి చేసింది.