- ప్రపంచ దేశాల ప్రజల ఉలికిపాటు
యావత్తు ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా వైరస్ చాలా దేశాలలో అదుపులోకి వచ్చి ప్రస్తుతం నిలకడగా ఉంది. కానీ గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ చైనాలో మాత్రం మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవతున్నాయి. ముఖ్యంగా కోవిడ్‌కు మూలకేంద్రమైన చైనాలో ఇప్పుడు భారీ ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. రోజువారి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం కొత్తగా 3,400 కొత్త కేసులు నమోదైనట్లు చైనా అధికారులు వెల్లడించారు. దీంతో అక్కడి ప్రభుత్వం షాంఘైలోని పాఠశాలలను మూసి వేసింది. కాగా మరికొన్ని కీలక నగరాల్లో లాక్‌డౌన్ విధించింది. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ వైరస్ రకాలు వ్యాప్తి చెందుతున్నట్లు సమాచారం. సరిహద్దు నగరం యాంజిని పూర్తిగా నిర్భంధించారు. ఈ నగరంలో ఏడు లక్షల మంది జనాభా ఉండగా ఆరు రౌండ్ల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఏదేమైనా ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు వైరస్ నుండి కోలుకొని కాస్త కుదుటపడి సాధారణ జీవనం సాగిస్తున్నారు. మళ్లీ ఈ వార్త విని ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.