end

కరోనా వైరస్‌ మళ్లీ విజృంభన

  • దేశవ్యాప్తంగా 28 వేల కొత్త కోవిడ్‌ కేసులు

దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. దాదాపు 28 వేల మంది కొత్తగా కరోనా బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,36,52,745కు చేరింది. కాగా 3,03,476 మంది చికిత్స పొందుతుండగా, 3,29,02,351 మంది బాధితులు కోవిడ్‌ నుండి కోలుకొని ఇండ్లకు వెళ్లినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే కరోనా వల్ల 4,46,918 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 26 వేలకు పైగా కోవిడ్‌ బాధితులు కోలుకొని వైరస్‌ నుండి బయటపడ్డారు.

పితృ దోషాలు ఎలా పోగొట్టుకోవాలి!?

అయితే దేశంలో కేవలం కేరళలోనే 16 వేలకు పైగా కోవిడ్‌ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ గుర్తించింది. ఇందులో 260 మంది వైరస్‌ వల్ల మరణించారు. కాగా 68,42,787 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయగా దేశ వ్యాప్తంగా మొత్తం 85,60,81,527 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఏదైమనా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం కరోనా వైరస్‌ నుండి పూర్తిగా బయపడ్డామనే భావన వద్దు.

కర్పూరంతో ఆరోగ్య లాభాలు

Exit mobile version