end

దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం

  • 24 గంటల్లో 88,600 పాజిటివ్‌ కేసులతోపాటు 1,124 మరణాలు..

తెలంగాణకు కొత్త ఐపీఎస్‌లు

భారతదేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో దేశంలో 88,600 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1,124 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 59,92,532కు చేరుకుంది. అయితే ఇందులో 9,56,402 కరోనా యాక్టివ్‌ కేసులుగా నమోదు కాగా 94,503 మంది కరోనా వల్ల మరణించారు. అయితే 49,41,627 మంది పేషెంట్లు కరోనా నుండి కోలుకొని ఇంటికి వెళ్లారు.

బీజేపీలో మహిళలకు కీలక పదవులు

ఇదిలావుండగా దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా రికవరీ శాతం పెరుగుతూ ఉంది. నిన్న ఒక్క రోజు దేశవ్యాప్తంగా 92,043 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధిక పాజిటివ్ కేసుల లిస్టులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజులో 20,419 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 13 లక్షలు దాటింది. కాగా, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల రేట్ 15.96 శాతం, రికవరీ రేట్ 82.46 శాతంగా.. డెత్ రేట్ 1.58 శాతంగా ఉంది.

అక్రమంగా రేషన్‌ బియ్యం విదేశాలకు ఎగుమతి !

Exit mobile version