end
=
Thursday, November 21, 2024
వార్తలుజాతీయండిసెంబర్‌లో కరోనా వైరస్‌ అంతం!
- Advertisment -

డిసెంబర్‌లో కరోనా వైరస్‌ అంతం!

- Advertisment -
- Advertisment -
  • ‘టైమ్స్ ఫ్యాక్ట్- ఇండియా ఔట్ బ్రేక్’ రిపోర్ట్ అంచనా

కరోనా లేదా కోవిడ్‌ 19 పేరు ఏదైనా గత ఆరు నెలల నుండి ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. మనిషి మనుగడే ప్రశ్నార్థకం చేసిన రక్కసి. మనిషి జీవితాలను ఏకాకులుగా మార్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే మానవ జీవితాలను కుక్కలు చింపిన విస్తరిగా మార్చింది. ఇటలీ, అమెరికాలో గుట్టలు గుట్టలుగా శవాలు. ఇంకా ఈ దుర్భర పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఏదేమైనా భారతదేశంలో కరోనా వ్యాప్తి త్వరలోనే తగ్గుతుందని, అదుపులోకి వస్తుందని సర్వేల రిపోర్టులు చేబుతున్నాయి.

తాజాగా కరోనా హాట్‌స్పాట్‌లుగా ఉన్న ఢిల్లీ, ముంబై నగరాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, దీంతో భారత్‌లో డిసెంబర్‌ చివరికల్లా 90 శాతం కరోనా వైరస్‌ అదుపులో ఉంటుందని ‘టైమ్స్‌ ఫ్యాక్ట్‌ – ఇండియా ఔట్‌ బ్రేక్‌’ రిపోర్టు చెబుతోంది. అయితే దేశంలో కోవిడ్‌ వల్ల మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదేసమయంలో దేశవ్యాప్తంగా రికవరీ శాతం కూడా పెరగడం కాస్త ధైర్యాన్ని, ఊరటనిస్తోంది.

ఐఓఆర్‌ నివేదిక ప్రకారం ఇండియాలో సెప్టెంబర్‌ 2 నాటికి కోవిడ్‌ పాజిటివ్‌ కేసులో పెద్ద సంఖ్యలో పెరిగే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 23 నాటికి, తెలంగాణలో ఆగస్టు 15 నాటికే కరోనా వైరస్‌ తీవ్ర స్థాయికి చేరుకుందని తెలిపారు.

ఇక నగరాల వారీగా వైరస్ తగ్గుముఖం పట్టేది ఎప్పుడో కూడా ఈ నివేదిక అంచనా వేసింది. నవంబర్ నాటికి ముంబైలో, అక్టోబర్ చివరికి చెన్నైలో, నవంబర్ ఫస్ట్ వీక్‌కు ఢిల్లీలో, అలాగే నవంబర్ మూడోవారానికి బెంగళూరులో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్ట్ అంచనా వేస్తోంది. అటు ఏపీలో నవంబర్ నాటికి, తెలంగాణలో అక్టోబర్ 17 నాటికి కరోనా పూర్తిగా అంతం కావొచ్చంది.
ఏదేమైనా ఈ మహమ్మారి నుండి భారతదేశంతోపాటు ప్రపంచం ఎప్పుడు సంపూర్ణంగా బయటపడుతుందో మరి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -