end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంతెలంగాణలో ఉచితంగా కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌
- Advertisment -

తెలంగాణలో ఉచితంగా కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌

- Advertisment -
- Advertisment -

తెలంగాణలో ప్రభుత్వం కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌ ఇవ్వనుంది. శుక్రవారం నుండి ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా కోవిడ్‌ వాక్సిన్‌ బూస్టర్‌డోస్‌ ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం బూస్టర్‌డోస్‌ అనుమతి ఇవ్వడంతో 18 ఏళ్ల పైబడిన అర్హులైన అందరికీ ఈ బూస్టర్‌ డోస్‌ అందుబాటులో ఉంటుందని తెలంగాణ రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. అయితే ఈ బూస్టర్‌ డోస్‌ను రెండవ డోస్‌ తీసుకొని 6 నెలలు పూర్తయిన వారికి మాత్రమే ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.

కారోనా వైరస్‌ నుండి కాపాడుకోవడం కోసం, రోగనిరోధకశక్తిని ప్రజల్లో పెంపొందించడం కోసం 75 రోజులపాటు ఈ బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరగనుందని, దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని హరీష్‌రావు వివరించారు. కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌ మొత్తం 20 లక్షల వరకు బూస్టర్‌ డోసులు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జూనియర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీలు పలు యూనివర్సిటీల్లో కూడా బూస్టర్‌ డోస్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. నాంపల్లి, సికిందరాబాద్‌ రైల్వేస్టేషన్లు, ఎంజీబిఎస్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌లలో 24 గంటలు బూస్టర్‌ వ్యాక్సిన్‌ సిద్దంగా ఉంచుతామని మంత్రి హరీష్‌ తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -