end

కొవిడ్‌ నిబంధనలు పూర్తిగా ఎత్తివేత

  • మార్చి 31 నుండి అన్ని రకాల కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి
  • ముఖానికి మాస్కు, భౌతికదూరం, చేతులు కడుక్కోవడం తప్పనిసరి

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ భారతదేశంలో తగ్గుముఖం పడుతుండడంతో కోవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కరోనా కట్టడి కోసం విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద మార్చి, 24, 2020లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే సమర్థవంతమైన వ్యాక్సిన్లు, కోవిడ్‌ రేటు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఇక నిబంధనలను మార్చి 31న పూర్తిగా ఎత్తివేయనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా రాష్ర్ట ప్రభుత్వాలకు, కేంద్ర ప్రాంత అధికారాలకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రజలు దీన్ని అసారాగా తీసుకొని విచ్చలవిడిగా ప్రవర్తించకూడదని, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. కాబట్టి ప్రజలు కచ్చితంగా ముఖానికి మాస్కు ధరించాలని, అలాగే చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి ఎవరికి వారు ఆరోగ్యంపై శ్రద్ధతో మెలగాలని ఆయన సూచించారు.

వెసులుబాట్లు ఏమిటి?

  • ఆసుపత్రులలో కోవిడ్‌ కోసం ప్రత్యేక వైద్య వసతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇకపై అన్ని రకాల వైద్య సేవలకు అనుమతి ఉంటుంది. ఆసుపత్రులలో ఆక్సిజన్‌, ఐసీయూ పడకలను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి.
  • విద్యాసంస్థలు పూర్తిగా తెరుచుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ తరగతులను పూర్తి స్థాయిలో నడుపుకోవచ్చు. కానీ తగిన జాగ్రత్తలు పాటించాలి.
  • క్రీడలు, వినోదం, సాంస్కృతిక, ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.
  • దుకాణ సముదాయాలు, సినీమా హాళ్లు, రెస్టారెంట్లు, బార్లు, జిమ్‌లు, స్పాలు, స్విమ్మింగ్‌పూల్స్‌, దేవాలయాలు, మతపరమైన ప్రాంతాలను పూర్తి స్థాయిలో నడపవచ్చు.
  • అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలను నడుపుకోవచ్చు. అంతరాష్ర్ట రవాణాకు ఎటువంటి నిబంధనలు లేవు.
  • అన్ని రకాల ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలను పూర్తి స్థాయి ఉద్యోగులతో నడుపుకోవచ్చు.
  • తప్పనిసరిగా అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి.
  • జిల్లా స్థాయిలో కొత్త కోవిడ్‌ కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.
  • వివాహాలకు, శుభకార్యాలకు, దైవ ప్రార్థనలకు, దహన సంస్కరణలకు పూర్తి సంఖ్యలో హాజరు కావచ్చు.
Exit mobile version