end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంఇక... ఎవరికి వారే కరోనా నిర్ధారణ పరీక్ష
- Advertisment -

ఇక… ఎవరికి వారే కరోనా నిర్ధారణ పరీక్ష

- Advertisment -
- Advertisment -
  • కోవి సెల్ఫ్‌ కిట్‌తో ఇంటి వద్దనే పరీక్ష
  • పుణెకు చెందిన మైలాబ్‌ సంస్థ కిట్‌ అభివృద్ధి
  • ఐసీఎంఆర్‌ ఆమోద ముద్ర
  • రూ.250 కే త్వరలో మార్కెట్‌లోకి

కరోనా టెస్టుల కోసం ప్రజలు బారులు తీరి లైన్‌లో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఇక తప్పనుంది. ఎవరికి వారే ఇంటి వద్దనే సొంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకొనేలా పుణెకు చెందిన మైలాబ్‌ సంస్థ సెల్ఫ్‌టెస్ట్‌ కిట్‌ను తయారు చేసింది. ఆమోదం కోసం ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోగా వారు ఆమోద ముద్ర వేసింది. దీంతో దేశంలోనే తొలిసారిగా సొంతంగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసుకునే అవకాశం, అదృష్టం ప్రజలు దక్కింది. ‘కోవి సెల్ఫ్‌’ పేరుతో టెస్ట్‌ కిట్‌ త్వరలో మార్కెట్‌లోకి రాబోతుంది. ఈ కిట్‌ ధర రూ.250 ఉండనుంది. దీనికి సంబంధించి ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ప్రజలు ఎలా దీన్ని ఉపయోనగించాలి? ఎలా పరీక్షలు చేసుకోవాలో సూచనలు చేసింది.

కిట్‌ను ఎలా ఉపయోగించాలి?

  • కోవి సెల్ప్‌ కిట్‌ను ఉపయోగించేవారు ముందుగా కోవి సెల్ప్‌ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • పరీక్ష చేసుకునే వారు తమ పూర్తి వివరాలను యాప్‌లో రిజిస్టర్‌ చేయాలి.
  • కిట్‌ను వాడే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి, అలాగే తడి లేకుండా చేతులు తుడుచుకోవాలి.
  • కోవి సెల్ఫ్‌ కిట్‌లో మూడు పరికరాలు ఉంటాయి. 1) నాసల్‌ స్వాబ్‌ 2) లిక్విడ్‌ ట్యూబ్‌ 3) టెస్టు చేసే కార్డు.
  • ముందుగా నాసల్‌ స్వాబ్‌ను తీసుకొని ముక్కు రంధ్రాల్లో కనీసం 2 నుండి 3 సెంటీమీటర్ల లోపల వరకు పెట్టుకొని 5 నుండి 6 సార్లు తిప్పాలి.
  • ఆ తర్వాత లిక్విడ్‌ ట్యూబ్‌ను తెరిచి ఈ స్వాబ్‌ను ముంచి 10 తిప్పాలి. ఆ తర్వాత స్వాబ్‌ను సగానికి విరగొట్టి మూత పెట్టాలి. నెమ్మదిగా ఒత్తుతూ రెండు చుక్కలను టెస్టు కార్డు చివరలో ఉండే గుంతలాంటి భాగంలో వేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత టెస్టు కార్డును ఫోటో తీసుకోవాలి.
  • 15 నిమిషాలపాటు అలాగే ఉంచితే ఫలితం కనబుడుతుంది. రెండు లైన్లు కనబడితే పాజిటివ్‌గా నిర్దారించుకోవాలి. ఒక లైన్‌ కనబడితే నెగిటివ్‌గా నిర్ధారించుకోవాలి.
  • కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలితే హోం ఐసోలేషన్‌లో ఉండాలి. మందులు వాడాలి.

ఇవి కూడా చదవండి…

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -