- 100 ఫీట్లతో గ్రీన్‌ఫీల్డ్ మైదానం వద్ద ఏర్పాటు
- కేరళ కుర్రాళ్ల ఐడియాకు నెటిజన్లు ఫిదా
Virat Kohli : భారీ కటౌట్లు (cut-outs) సాధారణంగా సినిమా హీరోలకు మాత్రమే చూసి ఉంటాం. కానీ, క్రీడాకారులవి మాత్రం ఎప్పుడూ, ఎక్కడ చూసిన సందర్భాలు లేవు. అయితే తిరువానంతపురం (Thiruvananthapuram) కుర్రాళ్లు ప్రంపంచాన్ని ఆకర్షించే ఐడియా (idea) తో ముందుకు రాగా అందరూ వాళ్లు చేసిన పని చూసి ఆశ్ఛర్యపోతున్నారు. ఈ మేరకు బుధవారం ఇండియా – సౌత్ ఆఫ్రికా (Ind vs sa) మధ్య తొలి టీ20 మ్యాచ్ (T20 Match) జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ (Greenfield) మైదానం వద్ద ఏర్పాటు చేసిన ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల (Kohli and Rohit) కటౌట్లు (cut-outs) అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం నెట్టింట వైరల్ (viral) అవుతున్న వీటిని చూసి ‘ఇదేం క్రేజ్‌రా సామీ’ అంటూ నెటిజన్లు (netizens) నోరెళ్లబెడుతున్నారు.
(INDIA:అలవోకగా గెలిచిన భారత్..)
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో గెల్చుకున్న టీమిండియా సఫారీలతో సమరానికి సిద్ధమైంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు (Kerala) కేరళలోని త్రివేండ్రంలో (Thiruvananthapuram)మొదటి మ్యాచ్ (1st Match) జరగనుంది. ఈ మ్యాచ్‌కోసం త్రివేండ్రం చేరుకున్న భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. అయితే తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ (Greenfield) మైదానం మైదానానికి వెళ్లేదారిలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల భారీ కటౌట్లు పెట్టారు ఫ్యాన్స్. ఆ కటౌట్ దాదాపుగా 100 అడుగులు (100 feets) ఉన్నట్లు తెలుస్తోంది. కేరళ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసోసియేషన్ (kerala rohit sharma fans association) ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుండగా.. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో (Twitter) షేర్ చేస్తూ.. ‘దైవభూమి హిట్‌మ్యాన్‌కు స్వాగతం పలుకుతోంది’ అని క్యాప్షన్ ఇవ్వడ విశేషం.
అలాగే స్థానిక బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson)కు టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కలేదు. దీంతో టీమిండియా మేనేజ్‌మెంట్, (Management) కెప్టెన్ రోహిత్ శర్మపై సంజూ ఫ్యాన్స్ ఆగ్రహం (fire) వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ట్యాలెంట్ ఉన్నా సంజూకు ఎందుకు ఛాన్సులు ఇవ్వడం లేదంటూ నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ విషయంపై బుధవారం నాటి మ్యాచ్ సందర్భంగా నిరసన తెలియజేసేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వచ్చాయి. అదే సమయంలో రోహిత్ కటౌట్లు ఏర్పాటుచేయడం చర్చనీయాంశమవుతోంది.
ఇక ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెలిచి సిరీస్‌పై ఆధిపత్యం చెలాయించాలని ఇరు జట్లు పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నాయి. దక్షిణాఫ్రికా (south africa)తో జరుగుతున్న సిరీస్‌కు ఆల్ రౌండర్ (All rounder) హార్దిక్ పాండ్యా (Hardik), పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar kumar)కు విశ్రాంతి ఇచ్చారు. దీంతో మొదటి మ్యాచ్ లో భారత్ తరపున ఆడనున్న ప్లేయింగ్ లెవన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కొంతమంది క్రీడాకారులను ఫిట్‌నెస్ సమస్య వేధిస్తుండటంతో తుది జట్టులో ఎవరెవరు ఆడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.