- ‘సిక్సర్ కింగ్’.. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రోహిత్
- 138 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 176తో రికార్డ్
- భారత సారథిపై ప్రశంసలు కురిపించిన సునీల్ గవాస్కర్
టీమిండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు (sixes) బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ (Record) నమోదు చేశాడు. న్యూజిలాండ్‌కు (New Zealand) చెందిన మార్టిన్ గప్టిల్ (Martin Guptill) 172 సిక్సర్లతో సంయుక్తంగా మొదటి నంబర్‌లో ఉన్న రోహిత్.. నాగ్‌పూర్‌లో (Nagpur) మొదటి సిక్స్ కొట్టి ఈ రికార్డును సృష్టించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గత రాత్రి నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలితో (Australia) జరిగిన రెండో టీ20లో భారత జట్టు విజయం సాధించి సిరీస్‌ను 1-1గా సమం చేసింది. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో 8 ఓవర్లకు (overs) కుదించిన మ్యాచ్‌లో ఇండియా 91 పరుగుల విజయ లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
అయితే పరుగులు రాబట్టడంలో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న రోహిత్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 46 పరుగులు (Runs) చేసి నాటౌట్‌గా (Not out) నిలిచాడు. 20 బంతుల రోహిత్ తుఫాను ఇన్నింగ్స్‌లో, హిట్‌మాన్ 4 ఫోర్లు, 4 సిక్సర్‌లు కొట్టాడు. ఆఖరి ఓవర్లో (last over)దినేష్ కార్తీక్ ఒక సిక్సర్, ఫోర్ కొట్టి నాలుగు బంతులు ముందుగానే టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట భారీ రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలోనే మార్టిన్ గప్టిల్‌ను అధిగమించిన రోహిత్ ఇప్పటి వరకు ఆడిన 138 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 176 సిక్సర్లు బాదాడు. న్యూజిలాండ్‌కు చెందిన గప్టిల్ 121 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 172 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా.. వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్ (Chris Gayle) మూడో స్థానంలో ఉన్నాడు.
ఇక ఈ మ్యాచ్‌పై స్పందించిన మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో (Star sports) మాట్లాడుతూ.. నాగ్‌పూర్ మ్యాచ్‌లో రోహిత్ చాలా సెలక్టివ్ షాట్లు (shots) ఆడాడని ప్రశంసించాడు. ఫ్లిక్‌షాట్లు, (flik shots) పుల్‌షాట్లను (full shots)అద్భుతంగా ఆడాడన్న ఆయన.. రోహిత్ అద్భుత ఇన్నింగ్స్‌కు ఇదే కారణమని విశ్లేషించాడు. ‘టీమిండియా టాపార్డర్ తరచూ విఫలమవుతుండడంతో బాధితుడిగా మారిన రోహిత్.. గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఒంటిస్తంభంలా నిలబడ్డాడు. టాపార్డర్ (Top order)పెవిలియన్ చేరుతున్నా అతడు మాత్రం క్రీజులో పాతుకుపోయి పరుగుల వర్షం కురిపించి జట్టుకు విజయాన్ని అందించాడు. రోహిత్ హిట్టింగ్‌లో ఎలాంటి సమస్యలు లేవని, తను ఏం చేయాలనుకున్నాడో నేటి మ్యాచ్‌లో సరిగ్గా అదే చేశాడని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. బంతి కోసం ఎదురుచూస్తూ నేరుగా ఆడకుండా కట్ చేస్తూ, పుల్ చేస్తూ అద్భుతంగా ఆడాడు’ అని గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు.
(‘మిస్టర్ కూల్’ రహస్యం చెప్పేసిన ధోని)