- న్యూజిలాండ్ పర్యటనలో మైదలైన ద్వైపాక్షిక సిరీస్
- భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై భారీ అంచనాలు
IND vs NZ: టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ముగిసిన తర్వాత క్రమంగా క్రికెట్ జట్లన్నీ ద్వైపాక్షిక సిరీస్‌ల (Bilateral series)కోసం సన్నద్ధమవుతున్నాయి. భారత్ (India)జట్టు కూడా న్యూజిలాండ్ (New Zealand) పర్యటనలో భాగంగా శుక్రవారం నుంచి మొదటి టీ20 మ్యాచ్‌ను ఆడబోతుంది. ఈ పర్యటనలో న్యూజిలాండ్ జట్టుతో భారత్ 3 టీ20 లు, 3 వన్డేల సిరీస్‌లను (series)ఆడనుంది. టీ20 సిరీస్‌కు యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) టీమ్ ఇండియాకు సారథ్యం వహించబోతుండగా, వన్డే సిరీస్‌కు మాత్రం శిఖర్ ధావన్ (Shikhar Dhawan)కెప్టెన్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.ఇక న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు రిషబ్ పంత్ (Rishabh pant)వైస్ కెప్టెన్‌గా ఉన్నందున అతడినే ఓపెనర్‌గా (opener)బరిలోకి దింపుతారని తెలుస్తోంది. గతంలో ఇంగ్లండ్ (Ingland)పర్యటనలో ఓపెనర్‌గా పంత్‌కు అవకాశం వచ్చింది. కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడీ లెఫ్ట్ హ్యాండర్. అయితే అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ఆస్ట్రేలియాలో (Australia)జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో (semi final) ఓడిపోయిన భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పుడు టీ20 సిరీస్‌లో ప్రత్యక్షంగా తలపడనున్నాయి. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ శుక్రవారం (నవంబర్ 18) వెల్లింగ్టన్‌లో (Wellington)జరగనుంది. రోహిత్(Rohit), విరాట్ (VIRAT), రాహుల్ (Rahul)వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించడంతో ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది టీమిండియా. కాగా దిగ్గజ బ్యాటర్లు లేని పక్షంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్న. ముఖ్యంగా రోహిత్, రాహుల్ లేకపోవడంతో ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు కెప్టెన్ పాండ్యా, కోచ్ లక్ష్మణ్ (Laxman)కానీ ఈ విషయంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే కెరీర్ తొలినాళ్లలో రిషబ్ ఓపెనర్‌గా ఆడాడు. అందువలన పంత్‌నే ఓపెనర్‌గా బరిలోకి దిగతాడని సమాచారం. దూకుడుగా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న పంత్ పవర్‌ప్లేలో భారీగా పరుగులు (Runs)సాధిస్తాడని అంచనా వేస్తు్న్నారు.
మరో ఎడమచేతి (Left hand batter) వాటం బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan kishan)కూడా ఓపెనింగ్ రేసులో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో కూడా కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే టీ20 ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు దక్కలేదు. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ 2024లో ఓపెనింగ్ స్థానానికి ఇషాన్ కిషన్ ప్రధాన పోటీదారుడిగా మారిపోయాడు. అలాగే టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఓపెనర్‌గా సంజూ శాంసన్ (Sanju samson)కూడా పోటీలో ఉన్నాడు. ప్రస్తుతం అతను మిడిల్ ఆర్డర్‌లో (middle order)రాణించి, టీమ్ ఇండియా తదుపరి ఫినిషర్‌గా (finisher) గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ టీ20 ఫార్మాట్‌లో, శాంసన్‌ను ఓపెనర్‌గా దిగే అన్ని అర్హతలు శాంసన్‌కు ఉన్నాయి. దీపక్ హుడా (Deepak hooda)కూడా ఓపెనింగ్‌కు పోటీదారు. ఐర్లాండ్ (Ireland) టీ20 సిరీస్ లో హుడ్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. అటువంటి పరిస్థితిలో, హుడా ప్రారంభ స్థానానికి మంచి ఎంపిక. అతడితో పాటు శుభ్‌మన్ గిల్ (Shubhman gill)కూడా ఓపెనింగ్‌కు పోటీదారు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు ఐపీఎల్‌లో (IPL)ఓపెనర్‌గా వచ్చిన అనుభవం ఉంది. ఇవే కాకుండా వన్డే, టెస్టు ఫార్మాట్లలో కూడా గిల్‌కు మంచి ఓపెనింగ్ అనుభవం ఉంది.
(FIFA World Cup 2022:నవంబర్ 20 నుంచి ‘ఫిఫా’ ప్రపంచకప్)
అలాగే ఈ రెండు సిరీస్‌లకు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ కోచ్‌గా (Coach) ఉంటాడు. శుక్రవారం వెల్లింగ్టన్‌లో జరగబోతున్న మొదటి టీ20 సందర్భంగా లక్ష్మణ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో (Press Conference)మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఈ సిరీస్‌లో టీ20 కెప్టెన్‌గా వ్యవహరించనున్న హార్దిక్ ప్యాండ్యా మీద పొగడ్తల వర్షం కురిపించాడు.“ఇది నాకు ఆనందకరమైన పర్యటన. జట్టులోని యువ ఆటగాళ్లతో నా అనుభావాన్ని పంచుకోవడానికి లభించిన సువర్ణావకాశం. భారత జట్టులోని వీళ్లంతా మంటి టాలెంటెడ్ ప్లేయర్ల (Lented players)ని ఐర్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు నాకు అనిపించింది. కానీ ఎంత ప్రతిభ ఉన్నా అనునిత్యం ప్రాక్టీస్ చేయాలి. ఆటను మెరుగు పరుచుకోవాలి. భారత్‌లో చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఎంపిక చేసుకోగలిగే అంత మంది ఆటగాళ్లను కలిగి ఉండటం భారత్‌కు అదృష్టమే’’ అని అన్నాడు.
జట్టు నాయకుడిగా హార్దిక్ పాండ్యా గురించి ఆయన మాట్లాడుతూ.. “హార్దిక మంచి నాయకుడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో అతడు ఏం చేసి చూపాడో మనమందరం చూశాం. టోర్నమెంట్‌లో ఒక ఫ్రాంచైజీకి మొదటి సంవత్సరంలో నాయకత్వం వహించడం, ఆ సంవత్సరమే లీగ్‌ను గెలవడం (Winning the league)అనేది మామూలు విషయం కాదు. అతను తన జట్టుతో ఏదైనా చేయించగలడు, సాధించగలడు. ఐర్లాండ్ సిరీస్ ఉన్నప్పుడు నేను అతనితో చాలా సమయం గడిపాను. అతను వ్యూహాత్మకంగా మాత్రమే కాకుండా, మైదానంలో ప్రశాంతంగా ఉంటాడు. ఒత్తిడికి గురయ్యే పరిస్థితుల్లో జట్టు నాయకుడిగా ప్రశాంతంగా ఉండాలి. ఇంకా అతను మైదానంలో తన జట్టును నడిపించే విధానం అద్భుతం’’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.