end

లారీని అపహరించుకెల్లారు..

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులో ఆగివున్న లారీని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించు కెల్లారు. తూప్రాన్ ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నాందేడ్ సమీపంలోని కాందార్ జిల్లాకు చెందిన శ్రీవారిగోవింద్ వాఘామర్‌కు స్వంత లారీ ఉంది. ఓనర్ అయినప్పటికీ డ్రైవర్గా  కొనసాగిస్తున్నాడు.

సెప్టెంబర్‌ 7 నుండి అన్‌లాక్‌ 4.0

మహారాష్ర్టలో ఈ నెల 26న మొక్క జొన్న లోడ్‌తో బయలుదేరి 28న మెదక్ జిల్లా వెల్దుర్థి మండలం మాసాయిపేట లోని ఓ సీడ్స్ కంపెనీలో లోడ్ను దింపాడు. మిర్యాలగూడలో బియ్యం లోడ్ ఉందని ఫోన్ రావడంతో 28న సాయంత్రం తూప్రాన్ నుండి హైదరాబాద్ బయలు దేరాడు. తూప్రాన్ బైపాస్ రోడ్డు వద్ద మూత్ర విసర్జన కోసం లారీని ఆపాడు. ఇదే సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు లారీతో పరారయ్యారు.

వినోదం కాదు…అంతా వివాదమే

డ్రైవర్ అరుస్తూ కేకలు వేస్తున్నా లారీని ఆపకుండా దుండగులు పరారయ్యారు. శనివారం సాయంత్రం బాధితుడు తూప్రాన్ పోలీసులను ఆశ్రయించగా ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Exit mobile version