end
=
Saturday, July 6, 2024
- Advertisment -

భారీ చోరీ

- Advertisment -
- Advertisment -
  • మాటు వేసి కాజేసిన 2442 సెల్‌ఫోన్లు
  • దొంగల కోసం గాలింపు
  • రెండు రాష్ర్టాల్లో సుమారు రూ. 5కోట్ల విలువ గల సెల్‌ఫోన్లు

వెబ్‌డెస్కు :  మాటు వేసి మాయం చేశారా.. లేక సినీ పక్కిలో చోరీకి పాల్పడ్డరా అనేది చర్చనీయశంగా మారింది. ఒకే రోజు రెండు కంటైనర్లు చెన్నై నుంచి ఢిల్లీకి సెల్‌ఫోన్ల లోడుతో బయాలు దేరాయి. ఒక కంటైనర్‌లోని సెల్‌ఫోన్లు ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 15న చోరీకి గురి కాగా మరో కంటైనర్‌లో ఫోన్లు 16న తెలంగాణ జాతీయ రహదారి 44పై చోరీ గురయ్యాయి. పూర్తి వివరాలు.. మొదటగా ఆంధ్రప్రదేశ్‌లోని కంటైనర్‌లో ఉన్న ఫోన్లు చోరీకి గురి కావడంతో కంపెనీ యాజమానులు కంగుతిన్నారు. వారు వెంటనే అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ గురైనవి వివరాలు తెలియక ముందే మరో కంటైనర్‌లోని ఫోన్లు గురి అయ్యాయి.  అది తెలంగాణ రాష్ర్టంలోని మెదక్ జిల్లా జాతీయ రహదారి 44 పై చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని, మాసాయిపేట డబా వద్ద జరిగింది. సుమారు రెండున్నర కోట్ల విలువైన 2442 సెల్‌ ఫోన్లు చోరీ అయ్యాయి. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శ్రీశైలం లోయలో పడిపోయిన వ్యాను

చైన్నై నుండి ఢిల్లీకి వెళ్తున్న సెలిఫోన్ల కంటైనర్  ఈ నెల 16న మొదక్‌ జిల్లా వెల్దుర్తి  మండలం మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ఉన్న  డబా వద్ద ఆపారు. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో నిర్మల్‌ జిల్లా ఇచ్చోడ వద్ద కంటైనర్‌ తాళాలు పగలుగొట్టి ఉండడాన్ని గమనించిన డ్రైవర్‌ ట్రాన్స్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు. కంటైనర్‌ను పరిశీలించిన ట్రాన్స్‌పోర్టు నిర్వాహకులు సమారు రూ. 2.50 కోట్ల  విలువ గల సెలుఫోన్లు చోరికి గురైనట్లు గుర్తించారు.  కంటైనర్‌ జీపీఎస్‌ ఉండడంతో కంపెనీ యాజమానులు కంటైనర్‌ మాసాయిపేట డబా వద్ద సుమారు 40నిమషాలు ఆగి వుందని గుర్తించారు.

నకిలీ రెండువేల నోట్లతో చీటింగ్‌కు యత్నం

దీంతో వారు అక్కడే చోరి జరిగి ఉంటుదని గమనించి మంగళవారం చేగుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు. రెండు చోట్ల చోరీకి గురైన సెల్‌ఫోన్ల విలువ సుమారు రూ.5కోట్ల ఉంటుందని వారు అన్నారు. పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అటు ఆంధ్రలో ఇటు తెలంగాణ లో సెలుఫోన్లు భారీ ఎత్తున్న చోరీ కావడంతో పోలీసులు కేసు సవాలుగా మారింది.

పోలీసుల ఎన్‌కౌంటర్‌ – మావోయిస్టు హతం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -