- నగ్నచిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్..
- చిత్రహింసలు పెట్టి అత్యాచారం…
ఒక స్నేహితురాలు ఇంకో స్నేహితురాలును వ్యభిచారం చేయిస్తుందని ఎవరైనా నమ్ముతారా..! నమ్మరు గాక నమ్మరు. ఎందుకంటే తనలాగే తాను కూడా ఒక స్ర్తీ కదా.. కానీ నల్గొండ జిల్లాలో ఓ దారుణం.. బర్తేడే ఉందని చెప్పి హాస్టల్ నుంచి రూము తీసుకెల్లి జ్యూస్‌లో మత్తు కలిపి ఇచ్చి తాగించింది. ఆపై తనతో ఉన్న ఓ యువకుడి ముందే తన ప్రెండ్‌ని బలవంతంగా బట్టలు విప్పగా యువకుడు వీడియో తీశాడు. అక్కడ నుంచి మొదలైంది బాధితురాలి వ్యద..
కండ్లు బైర్లు కమ్మాయి..
బాధితురాలు తన బాధను చెప్తుంటే కండ్లు బైర్లు కమ్మాయి. బాధితురాలు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన యువతి (25). తనే ఫ్రెండే నమ్మించి మోసం చేసింది. ముందుగా తన ఇంటికి బర్త్ డే అంటూ తీసుకెళ్లింది. ఇంట్లో ఓ యువకుడు మాత్రమే ఉన్నాడు. దీంతో అనుమానం వచ్చిన యువతి బర్తేడే లాగా కన్పించడం లేదని చెప్పడంతో ఇది నీకు మాత్రమే అంటూ ఓ గ్లాసులో జ్యూస్ ఇచ్చింది. నిద్ర వస్తుందని వెంటనే తాను ఉంటున్న హాస్టల్ వెళ్తానని చెప్పడంతో కాసేపు ఇక్కడే నిద్రపోయి వెల్లవచ్చని నమ్మబలికింది. నిద్ర మత్తులో ఉన్న సదరు యువతి బలవంతంగా బట్టలు విప్పించి నగ్న చిత్రాలు, వీడియోలను తీశారు.
వరుడు ముందే వధువుకు ముద్దుపెట్టిన ప్రియుడు
అప్పటి నుంచి మోసానికి పాల్పడిన యువకుడు, యువతిని బ్లాక్ మెయిల్ ప్రారంభించడం మొదలు పెట్టారు. విషయం ఎవరికైనా చెప్పితే క్లిప్పింగ్స్ పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు గురిచేశారు. అప్పటి నుంచి సినిమా షూటింగ్లు అంటూ పలు రాష్ట్రల్లోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వివిధ రంగాల్లోని యువకులతో అమానుషంగా అత్యాచారం చేయించారు. మద్యానికి అలవాటు చేసి సిగరెట్లు తాగించి చిత్ర హింసలకు గురిచేస్తూ అనాగరికంగా చెప్పరాని చోట్ల గాయాలు చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, చెన్నయ్, గోవా, మహారాష్ర్ట, ఆస్ర్టేలియా తదితర ప్రాంతాలకు చెందిన వారితో ఏకంగా 139మంది 5వేల సార్లు అత్యాచారానికి ఒడిగట్టారు.
ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో…
ఈ విషయం ఓ స్వచ్ఛంద సంస్థకు తెలిసి బాధితురాలికి అండగా నిలిచారు. దీంతో 42పేజీల లేఖతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. సెక్సుకు అంగీకరించకుంటే చంపుతామని మారణాయుధాలతో బెధిరంచారని ఫిర్యాదులో పేర్కొంది. తను నగ్నంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి తనకే పంపారని, అంతటితో ఆగకుండా వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసినట్లు తన ప్రెండ్స్ ద్వారా తనకు తెలిసి విస్తుపోయనని తెలిపింది. ఈ ఫిర్యాదు అనంతరం తనను కచ్చితంగా చంపుతారని దీన్నే మరణవాంగ్ములంగా బావించాలని కోరింది.
షాపూర్‌లో సినీ ఆర్టిస్టులతో వ్యభిచారం
ఎఫ్‌ఐఆర్ 42పేజీలు..
బాధితురాలు నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాలన్నింటినీ చేర్చడంతో ఎఫ్‌ఐఆర్ 42పేజీలైంది. ఇందులో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు సుమాన్‌తో పాటు పలువురు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఉన్నారు. వీరంతా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వారుగా భావిస్తున్నారు. ఇందులో సినిమా హీరో, యాంకర్, ఓ మాజీ మంత్రి పీఎ ఉండడంతో కేసును ముందుకు తీసుకపోవడం పోలీసులకు సవాలుగా మారింది. 139మందిపై 376(2), 509, 354, 354(ఎ), 354(సి) ఐపీసీ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.