end
=
Friday, September 20, 2024
క్రీడలుచెన్నైకి మరో విజయం
- Advertisment -

చెన్నైకి మరో విజయం

- Advertisment -
- Advertisment -

దుబాయ్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఎట్టకేలకు విజయం సాధించింది. 146 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ధోని సేన మరో 8 బంతులు మిగిలుండగానే 8 వికెట్లతో గెలుపొందింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(51 బంతుల్లో 65 పరుగులు; 4ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అంబటి రాయుడు(39 పరుగులు), డుప్లెసి(25 పరుగులు), ధోని(19 పరుగులు) విజయంలో కీలకపాత్ర వహించారు. ఆర్సీబీ బౌలర్లలో క్రిస్‌ మోరిస్‌, చాహల్‌ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 145 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లి(43 బంతుల్లో 50 పరుగులు) అర్ధసెంచరీతో రాణించగా.. ఏబీడీ(39 పరుగులు) భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో డుప్లెసీకి దొరికిపోయాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. బెంగళూరు భీకర బ్యాటింగ్‌ లైనప్‌ను కట్టడి చేయడంలో చెన్నై బౌలర్లు సక్సెస్‌ అయ్యారు. షాట్‌లు ఆడడానికి ఎలాంటి అవకాశమివ్వలేరు. సామ్‌ కర్రన్‌ 3 వికెట్లతో రాణించగా.. దీపక్‌ చాహర్‌ 2 వికెట్లు, సాంట్నర్‌ 1 వికెట్‌ తీశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -