end

Current Affairs:కరెంట్ అఫైర్స్

  • Global Forum of the Alliance of Civilizations

  • 9వ గ్లోబల్ ఫోరం ఆఫ్ ది అలియన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ (Global Forum of the Alliance of Civilizations) సదస్సు:
  • లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత ఉద్యమకర్త ఎల్సామేరీ డిసిల్వా (Elsamarie DeSilva) కృషిపై ఐరాస ప్రధాన కార్యదర్శి గెటెరస్ (Geterus) ప్రశంసలు కురిపించారు.
  • మొరాకోలోని ఫేజ్ నగరం (Fez is a city in Morocco)లో ప్రారంభమైన 9వ గ్లోబల్ ఫోరం ఆఫ్ ది అలియన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ సదస్సులో గుటెరస్ మాట్లాడారు.
  • నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది యువతను కదిలించడానికి ఆమె ప్రయత్నాలు ఉపకరించాయని డిసిల్వా (DeSilva)ను అభినందించారు.
  • రెడ్ డాట్ ఫౌండేషన్ (Red Dot Foundation) వ్యవస్థాపకురాలైన ఈమె ఈ సంస్థ ద్వారా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

ఆసియా కుబేరుల జాబితాలో సునాక్, అక్షతామూర్తి (Sunak, Aksathamurthy) :

  • బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి తొలిసారిగా యూకేకు చెందిన ఏషియన్ రిచ్ లిస్ట్ (Asian Rich List of UK) 2022 స్థానం పొందారు.
  • 780 మిలియన్ పౌండ్ల (రూ. 7,700 కోట్ల) సంపదతో సునాక్, అక్షత ఈ జాబితాలో 17వ స్థానాన్ని దక్కించుకున్నారు.
  • ఈ ఏడాది జాబితాలోని వారి మొత్తం సంపద 113.2 బిలియన్ పౌండ్లుగా నమోదైంది.
  • వరుసగా ఎనిమిదో ఏడాది హిందుజా కుటుంబం 30.5 బిలియన్ పౌండ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నలిచింది.

మలేసియా కొత్త ప్రధానిగా అన్వర్:

  • మలేసియాలో జరిగిన ఎన్నికలు హంగ్ పార్లమెంటుకు దారితీసినా రాజు ఆల్ సుల్తాన్ అబ్దుల్లా (All Sultan Abdullah) పలువురు పార్లమెంటు సభ్యులతో సంప్రదించి 75 ఏళ్ల అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim)తో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
  • అన్వర్ సంస్కరణవాది కాగా, మితవాది అయిన మాజీ ప్రధాని ముహిముద్దీన్ యాసిన్ పార్టీ నేషనల్ అలయన్స్‌ (Muhimuddin Yasin Party National Alliance)కు 73 సీట్లు వచ్చాయి.
  • 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి, జైలు శిక్షలు అనుభవించి, సంస్కరణల కోసం గట్టిగా నిలబడిన అన్వర్ పగ్గాలు చేపట్టడంతో దేశంలో స్టాక్ మార్కెట్ సూచీలు, మలేసియా కరెన్సీ (Currency of Malaysia) విలువ పెరిగాయి.

నేపాల్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని దేవ్ బా (Prime Minister Dev Ba) విజయం:

  • నేపాల్ పార్లమెంటు దిగువ సభ..ప్రజా ప్రతినిధుల సభకు ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్ బా (77) భారీ మెజారిటీతో గెలిచారు.
  • గడిచిన ఏడు ఎన్నికల్లో దేవ్ బా వరుసగా విజయాలు సాధించారు.
  • ప్రస్తుతం 5వ సారి ప్రధాన మంత్రి పదవి నిర్వహిస్తున్నారు.
  • పార్లమెంటు దిగువ సభతో పాటు ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి.

భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ (Parliament of Australia) అనుమతి:

  • భారత్- ఆస్ట్రేలియా (India- Australia) మధ్య స్వేచ్ఛా వాణిజ్యం త్వరలోనే అమల్లోకి రానుంది.
  • ఇందుకోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
  • ఇరుదేశాలు అంగీకరించిన తేదీనుంచి స్వేచ్ఛా వాణిజ్యం అమల్లోకి వస్తుంది.
  • భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదం పొందిందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని (Prime Minister Anthony) తెలిపారు.
  • ఇండియా – ఆస్ట్రేలియా ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (Economic Co Operation and Trade Agreement) (ఏఐ- ఈసీటీఏ) అమలు కావడానికి ముందు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం జరిగింది.
  • ఈ ఒప్పందం 2023 జనవరి నుంచి అమల్లోకి రానుంది.

(Vaishali:న‌వీన్ రెడ్డివి అన్ని అబ‌ద్దాలే.. అత‌నితో పెళ్లి కాలేదు)

Exit mobile version