- పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకోసం
- 2022 ఇంపార్టెంట్ ప్రశ్నలకు సమాధానాలు
ఎగుమతుల్లో ఔషధరంగం వాటా 33.41 శాతం:
తెలంగాణ (Telangana) లో తయారైన వస్తు సామాగ్రిలో అత్యధికం (26.26 శాతం) అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి.
ఆ తర్వాతి స్థానంలో చైనా (China)(6.78 శాతం), రష్యా (4.01 శాతం) ఉన్నాయి.
రాష్ర్టంలో తయారయ్యే ఔషధాలతో పాటు ఆహార, జౌళి ఉత్పత్తులు, వైమానిక విడిభాగాలు అమెరికాకు ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి.దేశంలోని ఔషధ ఉత్పత్తిలో 30 శాతం తెలంగాణలో జరుగుతోంది.దేశం నుంచి జరిగే ఔషధాల ఎగుమతిలో 50 శాతం వాటా రాష్ట్రానిదే.
మహారాష్ట్ర (Maharashtra) గ్రామానికి 26/11 దాడిలో అమరుడైన జవాన్ పేరు:
ముంబయి ఉగ్రదాడి 26/11లో అమరుడైన జవాను రాహుల్ శిండే (Rahul shinde)పేరును ఆయన స్వగ్రామానికి పెట్టారు.
మహారాష్ర్టలోని సోలాపూర్ జిల్లా సుల్తాన్ పూర్(Solapur District Sultanpur) లో 600 ఇళ్లు ఉంటాయి.
జవాను పుట్టిపెరిగిన ఈ గ్రామం పేరును రాహుల్ నగర్‌గా మార్పు చేశారు.
ప్రభుత్వ లాంచనాలు పూర్తి కావాల్సి ఉంది.
స్టేట్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (NRPF – ఎన్ఆర్‌పీఎఫ్) డ్యూటీలో ఉన్న రాహుల్.. తాజ్‌మహాల్ ప్యాలెస్ హోటల్‌లోకి ముందుగా ప్రవేశించగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బాడీలోకి తూటాలు దూసుకుపోయి ప్రణాలు కోల్పోయారు.
క్రీడలు: SPORTS
ఐసీసీ (ICC) టీ20 ర్యాంకింగ్స్ (Rankings)లో నంబర్‌వన్‌గా ‘సూర్యకుమార్ యాదవ్’
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (India’s star batsman Suryakumar Yadav) ఐసీసీ తాజా టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
కివీస్‌తో రెండో టీ20లో 111 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు, తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు.
కివీస్‌తో (New Zealand) సిరీస్ నుంచి 31 పాయింట్లు పొందిన అతడు ప్రస్తుతం 890 పాయింట్లతో ఉన్నాడు.
రెండో ర్యాంకు బ్యాట్స్‌మెన్ రిజ్వాన్ (Rizwan)పై సూర్య 54 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నాడు.
హార్థిక్ పాండ్య (Hardik pandya)50వ స్థానంలో నిలిచాడు.
ప్రపంచ పారా షూటింగ్ (Para shooting) ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు:
ప్రపంచ పారా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూట్లర్లు మూడు స్వర్ణ పథకాలు సాధించారు.
మూడు స్వర్ణాలు సహా 5 పతకాలతో ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు.
యూఏఈ (UAE) లో జరిగిన పోటీల్లో అయిదో స్థానంలో భారత్ నిలిచింది.
20 పతకాలతో దక్షిణ కొరియా (South Korea) అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.
(Overman jobs:లక్ష రూపాయల జీతంతో ఓవర్‌మ్యాన్ ఉద్యోగాలు)