end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయం'ప్రేమ' మంటలకు తల్లీకూతుర్లు బలి
- Advertisment -

‘ప్రేమ’ మంటలకు తల్లీకూతుర్లు బలి

- Advertisment -
- Advertisment -

కూతురు చదువుకోకుండా పక్కదారి పడుతుందని తెలిసిన తల్లి తన కూతురిమీద కిరోసిన్‌ పోసి తగలబెట్టాలనుకొని తను కూడా ఆ మంటల్లో కాలిపోయింది. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మండలం మొగిలిగిద్దలో చోటుచే సుకుంది. ఈ గ్రామానికి చెందిన పాండు – చంద్రకళల కుమార్తె స్రవంతి (17) బుద్దిగా చదువుకోకుండా ప్రేమాయాణం నడిపిస్తుందని, ఇదే విషయమై చాలా సార్లు మందలించినా తన కూతురు వినిపించుకోలేదు.

ఈ నెల 15న తల్లీకూతుర్లకు గొడవలు కూడా జరిగాయి. అదే సమయానికి తండ్రి పాండు వచ్చాడు. ఈ గొడవను చూసి కూతుర్ని చంపేస్తే ఈ సమస్య తీరుతుందని కూతురు స్రవంతిపై కిరోసిన్‌ పోశాడు. ఇదే క్రమంలో తల్లి చంద్రకళపైన కూడా కిరోసిన్‌ పడింది. ఇది గమనించకుండా తల్లి చంద్రకళ అగ్గిపుల్ల గీసి కూతురు స్రవంతిపై వేసింది. కూతురితోపాటు చంద్రకళకు కూడా మంటలు అంటుకున్నాయి.

దీంతో ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. ఉస్మానియా ఆసుపత్రిలో 4 రోజులుగా చికిత్స పొందుతున్న వీరిద్దరూ నిన్న మృతి చెందారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -