end
=
Saturday, January 18, 2025
క్రీడలుటాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న డీసీ
- Advertisment -

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న డీసీ

- Advertisment -
- Advertisment -

ఇవాళ ఐపీఎల్ తుది సమరం జరగనుంది. కాసేపట్లో దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యా్పిటల్స్‌.. ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. మొదట టాస్ గెలిచిన డీసీ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇది ఢిల్లీ జట్టుకు తొలి ఫైనల్‌ మ్యాచ్‌. ఐపీఎల్‌ లో ఆ జట్టు ఒక్కసారి కూడా కప్పుకొట్టలేదు. ఈ సారి ఎలాగైనా మ్యాచ్‌ గెలిచి, ట్రోఫీ అందుకోవాలని డీసీ తహతహలాడుతోంది. కోచ్‌ రికీ పాంటింగ్ సైతం తాము గెలవడానికే యూఏఈ వచ్చామని పునరుద్ఘాటించారు. క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో డీసీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును చిత్తుగా ఓడించింది. అదే ఊపులో ఫైనల్లో అడుగుపెట్టింది. ఆ జట్టుకు ధావన్‌, స్టోయినిస్‌ బ్యాటింగ్‌ అదనపు బలం. మిడిలార్డర్‌లో అయ్యర్‌, పంత్‌ పుంజుకుంటే డీసీ మంచి స్కోరు సాధిస్తుంది. రబాడా, నోర్ట్జ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌ కూడా సూపర్‌గా ఆడుతున్నారు.

మరోవైపు డీసీ అప్పోనెంట్‌ ముంబై ఇండియన్స్‌ ముందుగానే ఫైనల్‌ బెర్త్‌ సాధించి, ఐదో సారి టైటిల్‌ సాధించాలని కసి మీదుంది. ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. లీగ్‌ దశలో టేబుల్‌ టాపర్‌గా నిలిచిన ముంబై క్వాలిఫయర్‌ మ్యాచ్‌లోనూ ఢిల్లీపై ఘనవిజయం సాధించింది. ఈ సీజన్లో ఇరు జట్లు మూడు సార్లు తలపడగా.. అన్ని సార్లు ముంబైదే విజయమైంది. ఆ జట్టుకు ఓపెనర్లు డీకాక్‌, కిషన్‌ మంచి ఆరంభాలిస్తున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ విఫలమౌతున్నా.. సూర్యకుమార్ యాదవ్‌, పొలార్డ్, పాండ్యా సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. వారికి బౌలర్ల నుంచి మంచి సహకారం లభిస్తోంది. పేసర్లు బుమ్రా, బౌల్ట్‌.. అద్భుతంగా రాణిస్తున్నారు. స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ సైతం బాగా రాణిస్తున్నాడు. చూడాలి మరి ఫైనల్‌ విజేత ఎవరో.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -