end
=
Thursday, October 3, 2024
వార్తలుజాతీయంఘోర అగ్ని ప్రమాదం... 27 మంది మృతి
- Advertisment -

ఘోర అగ్ని ప్రమాదం… 27 మంది మృతి

- Advertisment -
- Advertisment -

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 27 మంది మంటలకు ఆహుతి కాగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశరాజధాని ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో నాలుగు అంతస్తుల గల వాణిజ్య భవన సముదాయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకొని 30 అగ్ని మాపక యంత్రాల సహాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ భవనంలో చాలా మంది చిక్కుకొని పోలీసులు భావిస్తున్నారు.

భవనంలో పలు కంపెనీల కార్యాలయాలు నడుస్తున్నాయి. సిసిటీవి కెమెరాలు, రూటర్లు తయారు చేసే కంపెనీలు మొదటి అంతస్తులో ఉన్నాయి. ఈ అంతస్తులోనే ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్మేసింది. మంటలు మిగతా ఫ్లోర్లకు కూడా వ్యాపించాయి. గాయపడిన వారిని సంజయ్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. 60 మంది సురక్షితంగా రక్షించినా ఇంకా చాలా మంది లోపల చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. అయితే ఈ భవనానికి అగ్నిమాపక శాఖ నుండి ఎటువంటి సేఫ్టీ క్లీయరెన్స్‌ లేదని గురించారు. బిల్డింగ్‌ యజమాని మనీష్‌ లాక్రా పరారీలో ఉన్నాడు. ప్రమాదం జరిగిన మొదటి అంతస్తులో ఉన్న కంపెనీ యజమానులు హరీష్‌ గోయల్‌, వరుణ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

delhi fire accident

ఈ అగ్ని ప్రమాద ఘటపై ప్రధానీ మోదీ, రాష్ర్టపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -