end

బోయగూడలో ఘోర అగ్ని ప్రమాదం

  • టింబర్‌ డిపోలో విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌
  • 11 మంది బీహార్‌ కూలీలు సజీవ దహనం

సికిందరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభించింది. బోయగూడ సమీపంలోని ఓ టింబర్‌ డిపో, స్ర్కాప్‌ గోడౌన్‌లో విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌ వల్ల పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటన తెల్లవారుజామున 4 గంటలకు జరిగినట్లు స్థానికులు తెలిపారు. మంటల్లో చిక్కుకొని 11 మంది సజీవ దహనమైయ్యారు. మంగళవారం రాత్రి ఆ గోదాంలో బీహార్‌కు చెందిన15 మంది కార్మికులు నిద్రించినట్లు స్థానికులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు.

బోయగూడలోని ఐడీహెచ్‌ కాలనీలో టింబర్‌, స్ర్రాప్‌ గోదాం ఉంది. మంగళవారం వేకువజామున విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌ సంభవించింది. భారీగా మంటలు రావడం, పొగ రావడంతో స్థానికులు ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యారు. అసలేం జరుగుతుందో తెలుసుకునే లోపే గోదాం మొత్తం కాలిబూడిదయ్యింది. ఈ ప్రమాదం నుండి ఇద్దరు కార్మికులు మాత్రం బయటపడినట్లు తెలుస్తోంది. మిగిలిన 13 మంది మంటల్లో చిక్కుకొనగా వీరిలో 11 మంది సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ముఖ్యంగా కట్టెలు ఉండడం వల్ల మంటలు ఎక్కువగా వ్యాపించాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

Exit mobile version