- బీజెపి అధ్యక్షుడు బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించిందని అలాగే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై విధిస్తున్న రూ.30 పన్నును తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యాట్ తగ్గిస్తే తెలంగాణలో లీటరు పెట్రోలు రూ.80కే లభిస్తుందని ఆయన ప్రజలకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ రైతులకు ఎలా, ఎందుకు సహాయం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. గొప్పల కోసం తెలంగాణ ప్రభుత్వ సొమ్మును ఇతర రాష్ర్టాలకు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. పెట్రోల్, డీజిల్‌పై వెంటనే వ్యాట్ తగ్గించాలని సంజయ్ డిమాండ్ చేశారు.