రోడ్డుదాటుతున్న జింకను కారు ఢీకొనడంతో జింక మృతి చెందిన ఘటన శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాబాద్‌వైపు నుండి శంషాబాద్ వైపు అతివేగంగా దూసుకొస్తున్న కారు రోడ్డు దాటుతున్న జింకను ఢీకొట్టింది. దీంతో ఆ జింక అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
- Advertisment -
కారు ఢీ… జింక మృతి
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -