- క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఘనవిజయం
నిన్న జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. దుబాయ్ వేదికగా రేపు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. గత మ్యాచ్‌లో(క్వాలిఫయిర్-1) ముంబై చేతిలో ఘోరపరాజయం నుంచి ఢిల్లీ గట్టి గుణపాఠం నేర్చుకుంది. అన్ని విభాగాల్లో అమోఘంగా పుంజుకొని గొప్ప విజయం అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 189/3 స్కోరు చేసింది. ధవన్ (50 బతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 78) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. స్టొయినిస్ (27 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 38), హెట్‌మయెర్ (22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ అయ్యర్ (20 బంతుల్లో ఫోర్‌తో 21) పర్లేదనిపించాడు. సందీప్ శర్మ, హోల్డర్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ సాధించారు.
అనంతరం, హైదరాబాద్ 20 ఓవర్లలో 172/8 స్కోరుకే పరిమితమై పరాజయం చవిచూసింది. విలియమ్సన్ (45 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67) హాఫ్ సెంచరీ చేశాడు. పాండే (21), గార్గ్ (17) ఓ మోస్తరుగా ఆడగా, అబ్దుల్ సమద్ (16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33) మెరిశాడు. రబాడ (4/29) నాలుగు, స్టొయినిస్ (3/26) మూడు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన స్టొయినిస్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.