- ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీదే పైచేయి
- 149-171 వార్డులు దక్కించుకునే అవకాశం
- 69- 91 స్థానాలకు పరిమితమైన బీజేపీ..
- కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్
- ఎగ్జిట్ పోల్స్ అంచనా.. రేపు ఫలితాలు
దేశరాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో (Delhi Municipal Elections) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆప్ (AAP)ఘనవిజయం సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ (Exit polls) తేల్చి చెప్పాయి. మూడు ప్రధాన ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఆప్ 149 నుంచి 171 స్థానాలు కైవసం చేసుకోవచ్చని వెల్లడయింది. ఏ రకంగా చూసినా ఆప్ మెజారిటీ 156 స్థానాలకు తగ్గదని తేలింది. ఢిల్లీలోని మూడు జోన్లను కలిపిన తర్వాత తొలిసారిగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో మొత్తం 250 స్థానాల్లో ఆప్‌కి కనీసంగా 155 స్థానాలు రావచ్చని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ సోమవారం తేల్చి చెప్పాయి. అజ్ తక్-యాక్సిస్ మై ఇండియా పోల్ (Az Tak-Axis My India Pol)ఆప్‌కి 149-171 స్థానాలు రావచ్చని అంచనా వేయగా, టైమ్స్ నౌ-ఇటిజీ పోల్ (Times Now-ITG Poll ) ఆప్‌కి 146 నుంచి 156 స్థానాల వరకు వస్తాయని పేర్కొంది.
కాగా రెండో స్థానంలో ఉన్న బీజేపీ (BJP) కి 69 నుంచి 91 స్థానాల వరకు రావచ్చని ఆజ్ తక్ పోల్స్ ఊహించగా, టైమ్స్ నౌ పోల్స్ ప్రకారం బీజేపీకి 84 నుంచి 94 స్థానాలు రావచ్చు. న్యూస్ ఎక్స్- జన్ కి బాత్ ఎగ్జిట్ పోల్స్ (Bath exit polls for news ex-gen) ఆప్‌కి 159 నుంచి 175 స్థానాలు వస్తాయని బీజేపీకి 70 నుంచి 92 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. కాగా అన్ని వార్తా చానెల్స్ కూడా కాంగ్రెస్‌కి (CONGRESS) మునిసిపల్ ఎన్నికల్లో 10కంటే తక్కువ స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. ఈ మూడు పార్టీలు కాకుండా ఇతరులకు 5 నుంచి 9 స్థానాలు వస్తాయని అంచనా.
(PM MODI:జీ20లో ప్రతి పౌరుడిని భాగం చేయండి)
బీజేపీకి శృంగభంగం – తిరుగులేని ఆప్
ఎగ్జిట్ పోల్స్ చెప్పే సంఖ్యలు తప్పు కావచ్చు. కానీ మూడు ప్రధాన చానెల్స్ (CHANNELS) అంచనాలు కరెక్టే అయితే ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలు బీజేపీకి ఎదురుదెబ్బేనని చెబుతున్నారు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా ఢిల్లీ మునిసిపాలిటీ బీజేపీ చెప్పుచేతల్లో ఉంటూ వచ్చింది. మునిసిపాలిటీలో అవినీతిని ఆప్ సమూలంగా నిర్మూలిస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ప్రచార సందేశం ఓటర్లపై (Voters) పనిచేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా కరెక్టే అని తేలితే మునిసిపల్ ఎన్నికలు కేజ్రీవాల్ (Kejriwal) పార్టీకి ఘనవిజయమేనని చెప్పాల్సి ఉంటుంది. మరోసారి ఢిల్లీ మునిసిపాలిటీలో పాగా వేయడానికి బీజేపీ అగ్రశ్రేణి నాయకులందరినీ డిల్లీకి తరలించింది. ఢిల్లీ స్థానిక ఎన్నికను జాతీయ రాజకీయాలతోనూ, ప్రధాని నరేంద్రమోడీ అభివృద్ధితోనూ ముడిపెడుతూ ఇల్లిల్లూ తిరుగుతూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రచారం చేశారు.
కానీ ఇవేవీ ఈసారి ఎన్నికల్లో ఆప్ వికాసాన్ని అడ్డుకోలేకపోతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద అటు ప్రభుత్వంతోపాటు, ఇటు మునిసిపాలిటీ కూడా ఆప్ కైవసం కానుందని తేలుతున్న నేపథ్యంలో ప్రాథమిక నగర ప్రాజెక్టులను సమర్థంగా నిర్వహించే అవకాశం ఆప్‌కి లభిస్తుందని భావిస్తున్నారు. 2013లో ఢిల్లీ మునిసిపాలిటీని ఉత్తర, దక్షిణ, తూర్పు (North, South, East) జోన్లుగా మూడుగా విభజించారు. ఈ ఎన్నికలకు ముందు ఈ మూడు జోన్లను ఒకటిగా చేసిన బీజేపీ తన గెలుపు పట్ల గంపెడాశలు పెట్టుకుంది. కాగా ఢిల్లీ మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 7న లెక్కించనున్నారు.