end
=
Saturday, September 21, 2024
వార్తలురాష్ట్రీయంజిల్లా ఖ్యాతిని చాటిన ఆర్జేసీ విద్యార్థిని..
- Advertisment -

జిల్లా ఖ్యాతిని చాటిన ఆర్జేసీ విద్యార్థిని..

- Advertisment -
- Advertisment -
  • నేడు ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే కవాతు లో పాల్గొననున్న విద్యార్థి
  • అభినందించిన పలువురు ప్రముఖులు

ఖమ్మమం : విద్యార్థులు ఎన్నుకున్న లక్ష్యానికి పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఆ నిరుపేద విద్యార్థిని. తండ్రి రైస్ మిల్లులో కూలీ పని చేస్తూ తమని చదివిస్తున్న దానికి సార్థకత చేకూర్చాలనుకుంది. అనుకున్నదే తడవుగా  తాను చదివే డిగ్రీ విద్యలో రాణిస్తూనే ఎన్.సి.సి.లో కూడా చేరి ఈ నెల 26న ఢిల్లీలో రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే కవాతులో పాల్గొననుంది. ఖమ్మం నగరంలోని ట్రంక్ రోడ్ ప్రాంతంలో గల ఆర్జేసీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన సిహెచ్.ఉమామహేశ్వరి పేద కుటుంబంలో పుట్టడం తప్పు కాదు.. పేదగానే పుట్టడం తప్పు అన్న సూక్తిని వంటబట్టించుకొని విజయం సాధించింది.

ఢిల్లీలో రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే కవాతులో జిల్లా నుంచి పాల్గొనే ఏకైక విద్యార్థిగా ఘనత సాధించి జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలిపింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ కవాతులో పాల్గొని సర్టిఫికేట్ పొందాలంటే అంత ఈజీ కాదు. ఎంతో శ్రమపడితే గానికి దక్కది ఈ అవకాశం. తన కఠోర శ్రమతో పట్టుదలనే ఆయుధంగా మలుచుకొని శోధించి సాధించింది.

సదరు విద్యార్ధిని కళాశాల చైర్మన్ గుండాల కృష్ణతో పాటు ప్రిన్సిపాల్ జాఫర్ ఖాన్, వైస్ ప్రిన్సిపాల్ అలవాల లింగయ్య, పలువురు అధ్యాపకులు, ఆర్జేసీ కళాశాల ఎన్ సిసి అధికారి లెప్ట్‌నెంట్‌ నిమ్మల సంపత్ యాదవ్, పలువురు ఎన్ సిసి అధికారులు, ఆర్మీ అధికారులు, ప్రముఖులు అభినందించారు. కాగా ఆమె సోదరి కూడా ఆర్జేసీ కళాశాలలో ఇంటర్ చదువుతూ రాణించడం విశేషం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -