end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌వంటలుChicken Fry : చికెన్ ఫ్రై చేసుకోండిలా
- Advertisment -

Chicken Fry : చికెన్ ఫ్రై చేసుకోండిలా

- Advertisment -
- Advertisment -

Chicken Fry : చికెన్ తో చాలా రకాల వంటకాలు మరియు స్నాక్స్ చేసుకోవచ్చు. చికెన్ కర్రీ (Chicken Curry), చికెన్ ప్రై (Chicken Fry), చికెన్ బిర్యానీ (Chicken Biryani), చికెన్ కబాబ్స్, చికెన్ డ్రంస్టిక్స్, చికెన్ 65, చికెన్ క్రిస్పీ బాల్స్ ఇలా రకరకాల వంటకాలు తయారు చేసుకుంటారు. ఎక్కువగా ఇష్టపడేది చికెన్ ప్రై అది ఎలా సులభంగా చేసుకోవచ్చో తెల్సుకుందాం..

చికెన్(Chicken) – ఒక కిలో, త‌రిగిన ఉల్లిపాయ‌లు- 2 (పెద్దవి), ఎండు మిర‌ప‌కాయ‌లు – 6, క‌రివేపాకు – రెండు రెబ్బలు, కొత్తిమీర- కొద్దిగా ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర- అర టీ స్పూన్‌, ల‌వంగాలు – 2, యాల‌కులు- 2, దాల్చిన చెక్క – కొద్దిగా, అల్లం వెల్లులి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్‌, కారం – సరిపడా, ప‌సుపు – అర టీ స్పూన్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, పెరుగు- ఒక కప్పు, నూనె- సరిపడా, నిమ్మకాయ-1,గుడ్డు 1, మొక్కజొన్న పిండి(Corn Flour) కొద్దిగా.

త‌యారీ విధానం:  ముందుగా చికెన్ ను బాగా కడిగి చిన్న చిన్నరంద్రాలు ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ కడిగినప్పుడు మిగిలిన నీరు ఉంటే పూర్తిగా పోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఒక వెడల్పాటి గిన్నె లో చికెన్ వేసి కొంచెం పెరుగు, కారం, పసుపు, ఉప్పు, నిమ్మ రసం, ఒక గుడ్డు, కొంచం దానియాలపొడి, కొంచం మొక్కజొన్న పిండిని వేసుకుని బాగా కలిపి.. ఆ చికెన్ ను మాగ్నెట్ చేసుకుని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసుకుని వేడి ఎక్కిన తర్వాత మాగ్నెట్(Magnetized) చేసుకున్నా చికెన్ ముక్కలని వేస్తూ బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించుకోవాలి. టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ ని రెడీ గా పెట్టుకొని వేయించిన ముక్కలని ఆ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ చికెన్ ముక్కలని వేసి పక్కన పెట్టుకోవాలి.  తర్వాత అది బాణలి లో కొంచం నూనె తీసి దానిలో నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను బంగారు వర్ణం వచ్చేదాక వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకుని ముందుగా ప్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకుని ఒక ఐదు నిమిషాలు వేగానివ్వాలి. చివరగా కొత్తిమీరను వేసుకుని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన(Delicious) చికెన్ ప్రై రెడీ…

(నోరూరించే చికెన్ బాల్స్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -