ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తాజాగా మరోసారి మండిపడ్డారు.
ఆన్‌లైన్‌లో జరిగిన నేషనల్ గార్డ్ ఆసోసియేషన్ వార్షి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ట్రంప్‌లగా నా వ్యక్తిగత కక్షసాధింపులకు పౌరుల హక్కులను కాల రాసేందుకు అమెరికా మిలటరీని వినియోగించబోనని ముందుగానే హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయల్లోకి మిలటరీని లాగాబోనని తెల్చిచెప్పారు.
కాగా ఇటీవల వివిధ సందర్భల్లో చోటు చేసుకున్న జాత్యహంకార వ్యతిరేక నిరసనలను అణచి వేసేందుకు ట్రంప్ మిలటరీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.