end

ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నా..

తను సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆరంభంలో చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెబుతోంది నటి తాప్సీ. కేరీర్ ఆరంభంలో తన అందం గురించి చాలా మంది అవమానించారన్నారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ తన అనుభవాలను పంచుకున్నారు. కెరీర్ ఆరంభంలో సినీ పరిశ్రమలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని తాప్సీ వెల్లడించింది. తనను హీరోయిన్‌గా తీసుకోవడానికి నిర్మాతలు ఇష్టపడేవారు కాదని పేర్కొంది.

అందం విషయంలో సినీ పరిశ్రమలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. నేను అందంగా లేననే కారణంతో కొంతమంది హీరోల భార్యలు నన్ను ఇష్టపడేవారు కాదు. తమ భర్త పక్కన నేను హీరోయిన్‌గా కనిపించడాన్ని వారు సిగ్గుగా భావించేవారు. నా స్థానంలో వేరే హీరోయిన్‌లకు అవకాశం ఇప్పించేవారు. అలాగే కొందరు నిర్మాతలు కూడా నన్ను హీరోయిన్‌గా తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఓ సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌ సీన్ కంటే నా ఇంట్రడక్షన్‌ సీన్‌ బాగా వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని ఆ హీరో డైరెక్టర్‌కు చెప్పి నా సీన్‌ను మార్చేశాడు. నాకు తెలిసి ఇలాంటివి ఎన్నో జరిగాయి. నాకు తెలియకుండా ఇంకెన్ని జరిగాయోనని తాప్సీ ఆవేదనగా తెలిపింది.

కానీ, ఒక్కసారి ఇండస్ట్రీలో నిలదొక్కుకొని, మన టాలెంట్‌ని నిరూపించుకున్నాక మనని ఆపేవారే ఉండరని యంగ్జ నరేషన్‌కు తాప్సీ సలహాలిచ్చింది. చిన్న సినిమాల్లో అవకాశాలు రాని రోజు నుంచి, ఏకంగా బిగ్‌ బీ అమితాబ్‌తో కలిసి నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నానని తాప్సీ గర్వంగా తెలిపింది. బాలీవుడ్‌లో సూపర్‌ డూపర్ హిట్‌గా నిలిచిన పింక్‌ సినిమాలో తాప్సీ కీలక పాత్రలో నటించి, విమర్శకులను సైతం మెప్పించింది.

Exit mobile version