end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంIndian Navy:విధ్వంసక యుద్ధనౌక
- Advertisment -

Indian Navy:విధ్వంసక యుద్ధనౌక

- Advertisment -
- Advertisment -

  • ‘ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌’లాంచ్ చేసిన రాజ్‌నాథ్ సింగ్
  • నౌకాదళంలోకి అడుగుపెట్టిన స్టెల్త్‌ గైడెడ్‌ క్షిపణి


Indian Navy: అత్యంత శక్తివంతమైన P15B స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక (War ship) ఐఎన్ఎస్ మోర్ముగావ్ (INS Mormugao)ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) నౌకాదళంలో (Indian Navy) ప్రవేశపెట్టారు. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌లో తయారైన దీని ప్రారంభించేందుకు రాజ్‌నాథ్ సింగ్‌కు సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమారి, గోవా గవర్నర్ పీఎస్ శ్రీథరన్ పిళ్లై, గోవా సీఎం ప్రమోద్ సావంత్ (CDS General Anil Chauhan, Navy Chief Admiral R. Hari Kumar, Goa Governor PS Sritharan Pillai, Goa CM Pramod Sawant visited Rajnath Singh.) తదితర ప్రముఖులు స్వాగతం పలికారు.

అనంతరం ముంబై నావల్ డాక్‌యార్ట్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యుద్ధనౌకల్లో ముర్ముగోవ్ ఒకటని అన్నారు. భారతదేశ తీరప్రాంత సామర్థ్యాల పెంపులో ఇదొక గణనీయమైన ప్రగతి అని అన్నారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి ఇదొక నిదర్శనమని, ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్తు అవసరాలను కూడా ఇందులోని వ్యవస్థలు తీర్చగలవని అన్నారు. స్వదేశీ పరిజ్ఞానం కలిగిన నౌకల తయారీ కేంద్రంగా ఇండియాను తీర్చిదిద్దాలనేది తమ లక్ష్యమని అన్నారు. ఇతర దేశాలకు కూడా నౌకానిర్మాణాలు చేసిపెడతామని తెలిపారు.స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధనౌకల తయారీ చరత్రలో క్షిపణి విధ్వంసక ముర్ముగోవ్ జలప్రవేశం ఒక మైలురాయి అని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ (Navy Chief Admiral R. Harikumar)అన్నారు. ఏడాది క్రితమే విశాఖపట్నంలో (Visakhapatnam) ముర్ముగావ్ యుద్ధనౌకను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గత దశాబ్దంగా వార్ షిప్ తయారీ, నిర్మాణ సామర్థ్యం దిశగా పడిన కృషికి ముర్ముగోవ్ నిదర్శనమని అన్నారు. చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్ పేరిట యుద్ధనౌకకు నామకరణం చేశామని చెప్పారు.

INS మర్ముగోవా 7,400 టన్నుల బరువు, 163 మీటర్ల పొడవు. 17 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ యుద్ధనౌకలో అత్యాధునిక సెన్సర్లు, రాడార్‌ (Sensors, radar) వ్యవస్థలను అమర్చారు. ఉపరితలం నుంచి ఉపరితలంపైన, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థ దీనిలో ఉంది. ఇది P15 బ్రేవ‌ర్ క్లాసుకు చెందిన‌ది. ఎలాంటి స‌మ‌యంలోనైనా దీన్ని ఆప‌రేట్ చేసేలా తయారుచేశారు.(Anti-air and anti-submarine weapons) యాంటీ ఎయిర్‌, యాంటీ స‌బ్‌మెరైన్ ఆయుధాలు ఈ షిప్‌ (Ship)లో ఉన్నాయి. మిస్సైల్ వ్యవ‌స్థ కూడా ఉంది. INS మోర్ముగావ్‌.. సెకండ్ జ‌న‌రేష‌న్‌కు చెందిన స్టీల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయ‌ర్‌ (Stealth Guided Missile Destroyer). ప్రాజెక్టు 15బీ కింద దీన్ని త‌యారు చేశారు. భార‌త నౌకాద‌ళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీన్ని డిజైన్ (was designed by the Warship Design Bureau) చేసింది. మ‌జగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ దీన్ని నిర్మించారు. విశాఖ‌ప‌ట్టణం, మర్మగోవా, ఇంపాల్‌, సూర‌త్ (Marmagoa, Imphal, Surat) న‌గ‌రాల పేరు మీద నాలుగు విధ్వంస‌క యుద్ధ నౌక‌ల‌ను త‌యారు చేస్తున్నారు. వాటిలో ఇది రెండోది.

(Hyderabad:వైద్య రంగానికే పెద్ద పీట)

INS మోర్ముగావ్‌ ఎంట్రీతో భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌ను భారత్‌లో తయారైన అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌక ఒకటిని అన్నారు రాజ్‌నాథ్‌. భవిష్యత్‌లో మరిన్ని యుద్ద నౌకలు తయారు చేస్తామన్నారు. వార్‌షిఫ్ డిజైన్ బ్యూరో దేశీయంగా రూపొందించిన నాలుగు వి శాఫట్నం క్లాస్ డిస్ట్రాయిర్లలో మోర్ముగావ్ రెండవది. మజగావ్ డాక్ షిప్ బిల్టర్స్ లిమిటెడ్ (Mazagon Dock Ship Builders Ltd) దీనిని నిర్మించింది. 163 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు, 7400 టన్నుల బరువు కలిగిన యుద్ధనౌక ఇది. ఇందులో అధునాతన ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. ఆధునిక నిఘా రాడార్‌ ఏర్పాటు చేశారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి క్షిపణలు ప్రయోగించ వచ్చు. నాలుగు శక్తివంతమైన గ్యాస్ టర్బయిన్లతో గంటకు 30 నాట్‌ల వేగాన్ని అందుకోగలదు. దీంతో ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత బలం చేకూరుతోందని కేంద్రమంత్రి తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -