end

అభివృద్ధే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుంది

  • మందాడి శ్రీనివాసరావు

కూకట్‌పల్లి(కేపీహెచ్‌బీ) 114 డివిజన్ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. 9వ ఫేస్‌లో గల పార్టీ కార్యాలయం నుంచి ముఖ్య నాయకులు, అభిమానులు, డివిజన్‌కు చెందిన వెల్ఫేర్‌ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, మూసాపేట్ సర్కిల్లో రిటర్నింగ్అ ధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే పార్టీని భారీ మేజార్టీతో ఘనవిజయం సాధించేందుకు దోహదపడతాయన్నారు. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ కచ్చితంగా 100కు పైగా డివిజన్లు గెలుచుకోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సాయిబాబా చౌదరి, నియోజకవర్గ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, సురేష్ రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version