end
=
Friday, September 20, 2024
వార్తలుజాతీయంGujarat Development: గుజరాత్‌లో వేల కోట్ల అభివృద్ది
- Advertisment -

Gujarat Development: గుజరాత్‌లో వేల కోట్ల అభివృద్ది

- Advertisment -
- Advertisment -
  •  సూరత్ పట్టణంపై ప్రశంసలు కురిపించిన ప్రధాని
  •  1.25 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారని వెల్లడి
  • ఈ ప్రాంతం 4పీ మోడల్‌కు చిరునామా అంటూ పొగడ్తలు

Gujarat Development: భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) తన సొంతరాష్ట్రం గుజరాత్ అభివృద్ధి(Development)కోసం వరాల జల్లు కురిపించారు. రెండోసారి జరిగిన ఎన్నికల్లో భాగంగా డబుల్ ఇంజిన్ (double engine government) ప్రభుత్వం ఏర్పడితే వేగంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని మాటిచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా రెండు రోజుల గుజరాత్ పర్యటనలో గురువారం రూ.3,400 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్ధేశించిన మాట్లాడిన మోడీ.. గుజరాత్‌లో డబుల్ ఇంజిన్(Double Engine) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుందని చెప్పిన మాట నిలబెట్టుకుంటాన్నామన్నాడు. పేదలకు, మధ్య తరగతి వారికి ఇతర సదుపాయాల కల్పన కూడా ఊపందుకుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ స్కీం(Ayushman Bharat Scheme) ద్వారా 4 కోట్ల మంది పేద రోగులు ఉచిత చికిత్స అందించామని చెప్పారు. గుజరాత్‌లో ఇప్పటివరకు 32 లక్షల మందికి మేలు చేకూరగా, కేవలం సూరత్‌లోనే 1.25 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారని పేర్కొన్నారు. సూరత్(Surat) నగరం ప్రజల సంఘీభావానికి, ప్రజల భాగస్వామ్యానికి అద్భుతమైన ఉదాహరణ అన్నారు.

అలాగే భారతదేశంలోని ఏ మతానికి చెందినవారైనా ఇక్కడ ఉంటారన్న ప్రధాని.. గతంలో 3పీ మోడల్ గురించి ప్రస్తావిస్తే, ప్రస్తుతం సూరత్ 4పీ మోడల్ (ప్రజలు, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్)కు చిరునామాగా ఉందని చెప్పారు. ఇదే సూరత్‌ను ప్రత్యేకంగా చేస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహానాలను ప్రోత్సాహం కల్పిస్తామని, 500 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్న ఆయన.. అలాగే డ్రీమ్ సిటీ ప్రాజెక్టు(Dream city Project) సూరత్‌ను సురక్షిత, అనుకూలమైన డైమండ్ ట్రేడింగ్ హబ్‌గా మార్చేందుకు దోహదపడుతుందన్నారు. ఇక బిజేపి పాలనలో గుజరాత్ మాత్రమే కాదు ముఖ్యంగా డబుల్ ఇంజిన్ అధికారం కలిగివున్న రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

(Indian Attorney : భారత కొత్త అటార్నీగా వెంకటరమణి)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -