end

ధరణి.. ఓ సంచలనం: మెదక్ కలెక్టర్

తూప్రాన్: రాష్ట్ర రైతాంగం శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ వెబ్ ను ప్రారంభించిందని మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ లో గురువారం తూప్రాన్ అర్డీఓ శ్యామ్ ప్రకాష్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ శ్రీదేవితో కలిసి ధరణి వెబ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతు భూమి వివరాలు ఆన్‌లైన్‌లో భద్రంగా ఉంటాయన్నారు. భూముల అమ్మకాలు జరిగితే.. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మ్యుటేషన్, పట్టా మార్పిడి జరుగుతుందన్నారు. ఇక్కడా భూ వివాదాలకు చోటు ఉండదన్నారు. ధరణి వెబ్‌ పోర్టల్ ఓ సంచలన నిర్ణయమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిప్యూటీ తహశీల్దార్ లు నాగవర్ధన్, ఇంద్రాణి, రాజిరెడ్డి, ఆర్ఐ సంతోషకుమార్, రెవెన్యూ సిబ్బంది వేణు, కంప్యూటర్ ఆపరేటర్ లు పాల్గొన్నారు.

Exit mobile version